ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న వయస్సులోనే కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి దృష్టి తగ్గుతోంది. కంటి చూపు మందగిస్తోంది. దీంతో చిన్న వయస్సులోనే అద్దాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం వల్ల కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటంటే..
మెదడుతో పాటు కళ్లకు కూడా బాదం పప్పులు ఎంతగానో మేలు చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉంటాయి. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది కళ్లకి చాలా ముఖ్యం. రోజూ 8-10 ఎండుద్రాక్షలను లేదా 4 నుండి 5 బాదంపప్పులను నీటిలో నానబెట్టి ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. ఇవి కళ్లకు రక్షణను అందిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
2. క్యారెట్ల వినియోగం కళ్లకు ఎంతగానో మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో క్యారెట్లను చేర్చడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. మరోవైపు సిరి జ్యూస్‌తో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు ఎక్కువ కాలం పాటు చెదిరిపోకుండా ఉంటుంది.
3. రోజ్ వాటర్ కంటి సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కండ్లకలక లేదా పింక్ ఐ, వాపు నుండి బయటపడటానికి సహాయపడతాయి. రోజ్ వాటర్‌లో శుభ్రమైన పత్తిని ముంచి మూసిన కనురెప్పలపై మెత్తగా రుద్దవచ్చు. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
4. తేనె మన శరీరానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి శ్రేయస్సు కోసం ఒక టీస్పూన్ తేనెతో తాజా ఉసిరి కాయ జ్యూస్‌ను రోజూ తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే దీనిని తీసుకోవాలి. ఇది కంటికి మేలు చేస్తుంది. తాజా ఉసిరి లభించకపోతే ఉసిరిక పొడిని కూడా ఉపయోగించవచ్చు.