Fruits For Weight Loss : చాలా మంది బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. కొందరు జిమ్‌లలో గంటల తరబడి వ్యాయామం చేస్తారు. కొందరు రోజూ వాకింగ్, యోగా, స్విమ్మింగ్ వంటివి చేస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవన్నీ అవసరమే. అయినప్పటికీ ఇవే కాదు.. మనం తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటించాల్సిందే. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను మనం రోజూ తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. పొట్ట, తొడల దగ్గర ఉండే కొవ్వు ఇట్టే కరిగి సులభంగా బరువు తగ్గుతారు. ఇక బరువు తగ్గాలంటే రోజూ తినాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువును తగ్గించడంలో బెర్రీ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ప్‌బెర్రీలు.. ఈ కోవకు చెందుతాయి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవన్నీ వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా కొవ్వును కరిగిస్తాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఈ బెర్రీ పండ్లను తింటుండాలి. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది. అలాగే గ్రేప్ ఫ్రూట్ కూడా కొవ్వును కరిగించగలదు. ఈ పండ్లలో అధికంగా నీరు ఉంటుంది. అందువల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆకలి త్వరగా వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా గ్రేప్ ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.
రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటారు. అలాగే ఈ పండును రోజూ ఒకటి తినడం ద్వారా కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇందులో ఉండే ఫైబర్ కొవ్వును కరిగించేందుకు సహాయ పడుతుంది. అందువల్ల బరువు తగ్గుతారు. కనుక యాపిల్స్‌ను కూడా రోజూ తినాలి. అవకాడో పండ్లలో మన శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించడంలో సహాయం చేస్తాయి. కనుక అవకాడోలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన శక్తిని అందిస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రోజూ నారింజ పండ్లను తింటుంటే తప్పకుండా బరువు తగ్గుతారు. కివీ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కనుక కివీ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అది కొవ్వుగా మారదు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కనుక కివీ పండ్లను కూడా రోజుకు ఒకటి చొప్పున తింటే మేలు జరుగుతుంది.
పుచ్చకాయలు మనకు కేవలం వేసవిలోనే కాదు.. ఇతర సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కనుక వీటిని తరచూ తినాలి. వీటిల్లో నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కనుక కొంత తిన్నా చాలు.. కడుపు నిండిపోతుంది. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. ఇలా పలు పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. బరువు తగ్గడమే కాదు.. పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో పోషకాహార లోపం రాకుండా చూసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఇతర ఏ ఆహారాలు అయినా సరే బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. కనుక వాటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చు.