హెల్త్ టిప్స్

Fruits For Skin : వీటిని తీసుకుంటే చాలు.. మీ చ‌ర్మం ఎంతో అందంగా మారుతుంది..!

Fruits For Skin : నేటి ఆధునిక యుగంలో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ అందం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో వారు అందంగా కనిపించడం కోసం రక రకాల కృత్రిమ పద్ధతులను కూడా అవలంబిస్తున్నారు. దీంతో వాటి ద్వారా ఇతర సైడ్ ఎఫెక్ట్‌లు కూడా కలుగుతున్నాయి. అయితే కింద సూచించిన విధంగా ఆయా పండ్లను మీ ఆహారంలో నిత్యం భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు చేకూరడమే కాదు, చర్మం నిగారింపును కూడా సొంతం చేసుకుంటుంది. దీంతోపాటు అందంగానూ కనిపించవచ్చు. యాపిల్ పండ్లలో ఉండే మాలిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. పొటాషియం అధికంగా ఉండడం వల్ల చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

యాపిల్స్‌లో ఉండే కాపర్ చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. నాశనమైన చర్మ కణాలకు పునరుత్తేజం కలిగిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ సి శరీరంలో నాశనమైన కణజాలాలను బాగు చేస్తుంది. యాపిల్స్‌లోని పీచు పదార్థం మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. చర్మానికి సంరక్షణను అందించే గుణాలు అరటి పండ్లలో ఉన్నాయి. చర్మానికి సహజ సిద్ధంగా ఉండే సాగే గుణాన్ని ఇవి నియంత్రణలో ఉంచుతాయి. చర్మంపై ఏర్పడే మచ్చలను తొలగిస్తాయి. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలను తగ్గించే యాంటీ ఏజింగ్ గుణాలు అరటిపండ్లలో ఉన్నాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతుంది.

take these fruits your skin will glow

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో పుచ్చకాయలు ఉపయోగపడతాయి. వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే లక్షణాలను తగ్గిస్తాయి. పుచ్చకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. తద్వారా చర్మానికి ఆరోగ్యం కలుగుతుంది. దానిమ్మ పండ్లలో కేవలం విత్తనాలే కాకుండా దాని తొక్క‌, లోపల ఉండే పదార్థం కూడా చర్మ సంరక్షణకు ఉపయోగపడ‌తాయి. యాంటీ ఆక్సిడెంట్లు వీటిలోనూ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. గ్రీన్ టీ, బ్లూ బెర్రీల్లో ఉన్నన్ని గుణాలు దానిమ్మ పండ్లలోనూ ఉన్నాయి. కేవలం చర్మానికే కాకుండా దానిమ్మ పండ్లను తరచూ తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.

బొప్పాయి పండ్లలో ఉండే విత్తనాలు డెడ్ స్కిన్ సెల్స్‌ను, శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో బాగా ఉపయోగపడతాయి. చర్మాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచడంలో బొప్పాయి బాగా పనిచేస్తుంది. దీంట్లోని ఎంజైమ్‌లు చర్మాన్ని శుద్ధి చేసి దానికి మెరుపును తెస్తాయి. చర్మం రంగును మార్చడంలో నారింజ సమర్థవంతంగా పనిచేస్తుంది. నాశనమైన శరీర కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. నారింజలో ఉండే విటమిన్ సి ఎండ, కాలుష్యం కారణంగా రంగు మారిన చర్మానికి తిరిగి మునుపటి రంగును తెస్తుంది. పైనాపిల్‌లో ఉండే ఔషధ గుణాలు చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. చర్మానికి మెరుపును తెస్తాయి. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో బాగా ఉపయోగపడతాయి. క‌నుక ఈ పండ్ల‌ను త‌ర‌చూ తింటుంటే చ‌ర్మం ఎంతో అందంగా మారుతుంది.

Admin

Recent Posts