Healthy Drinks : వేస‌వి కాలంలో ఏం పానీయాల‌ను తాగాలో తెలియ‌డం లేదా.. వీటిని తాగండి.. చ‌ల్ల‌గా ఉంటుంది..!

Healthy Drinks : వేస‌విలో ఉండే అధిక ఉష్ణోగ్ర‌త‌ల నుండి మ‌న శ‌రీరాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా అందించ‌డం చాలా అవ‌స‌రం. అయితే చాలా మంది వేస‌వి తాపం నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ఐస్ క్రీమ్ ల‌ను, శీతల పానీయాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎటువంటి మేలు క‌ల‌గ‌దు. అంతేకాకుండా శ‌రీరానికి అధికంగా క్యాలరీలు ల‌భిస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. క‌నుక మ‌న శ‌రీరానికి మేలు చేయ‌డంతో పాటు వేస‌వితాపం నుండి బ‌య‌ట‌ప‌డేసే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. బ‌ట‌ర్ మిల్క్, పెరుగు, చియా విత్త‌నాలు, స‌బ్జా గింజ‌లు వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి మేలు క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. వేస‌వి తాపం నుండి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అయితే వేసవి కాలంలో కొన్ని ర‌కాల పానీయాల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వేస‌వికాలంలో త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుకుండా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వేసవికాలంలో తీసుకోవాల్సిన పానీయాలు ఏమిటి.. వీటిని ఎలా త‌యారు చేసుకోవాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వేస‌వికాలంలో నీటిని ఎక్కువ‌గా తాగాలి. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున రెండు గ్లాసుల నీటిని త‌ప్ప‌కుండా తాగాలి. ఇది శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో స‌హాయ‌ప‌డతాయి. అలాగే వేస‌వికాలంలో పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అర క‌ప్పు పెరుగులో కొద్దిగా అల్లం త‌రుగు, కొద్దిగా ప‌సుపు, మిరియాల పొడి వేసి క‌లిపి ప్రిజ్ లో ఉంచాలి. దీనిని ఉద‌య‌మే తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే కీర‌దోస జ్యూస్ ను ఎక్కువ‌గా తీసుకోవాలి. జార్ లో కీర‌దోస ముక్క‌లు, 4 పుదీనా ఆకులు, ఒక చిటికెడు చాట్ మ‌సాలా ఒక టీ స్పూన్ ప‌చ్చి మామిడికాయ ముక్క‌లు వేసి జ్యూస్ లాగా చేసుకుని తాగాలి.

take these Healthy Drinks in summer for cooling body
Healthy Drinks

ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో నిమ్మ‌ర‌సం, నాన‌బెట్టి చియా విత్త‌నాలు పావు టీ స్పూన్ మోతాదులో క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుపడడంతో పాటు శ‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. అలాగే కొబ్బ‌రి నీటిలో, పుచ్చ‌కాయ జ్యూస్ లో కూడా నాన‌బెట్టిన చియా విత్త‌నాల‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు. అలాగే బ‌ట‌ర్ మిల్క్ లో పుదీనా , క‌రివేపాకు ఆకులు వేసి మిక్సీ ప‌ట్టుకుని తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ పానీయాల‌ను రోజూ ఉద‌యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి మేలు క‌ల‌గ‌డంతో పాటు వేసవికాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము.

D

Recent Posts