High Blood Pressure : ప్రస్తుత కాలంలో మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పుల కారణంగా చిన్న వయస్సు నుండే అనేక దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడుతున్నాం. ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధులల్లో ఒకటి హైబీపీ. ఈ బీపీ కారణంగా హార్ట్ ఎటాక్ లు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. హైబీపీ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఊబకాయం, మానసిక ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, ఉప్పును అధికంగా తీసుకోవడం వంటి వాటిని హైబీపీ రావడానికి కారణాలుగా వైద్యులు చెబుతున్నారు.
హైబీపీ సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో 100 మందిలో 70 మంది హైబీపీ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి మనం హైబీపీ బారిన పడితే జీవితాంతం వైద్యులు సూచించిన మందులను వాడాలి. అయితే హైబీపీని తగ్గించి రక్త నాళాలల్లో మార్పులు తీసుకు రావడానికి సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన ఔషధం ఒకటి ఉంది. దీనిని మనం వంటల్లో కూడా వాడుతూ ఉంటాం. ఈ ఔషదమే వాము. మనం వామును జలుబూ, దగ్గు, శరీరంలో పేరుకు పోయిన కఫాన్ని తొలగించడంలో చాలా వరకు వాడుతూ ఉంటాం. వాము హైబీపీని నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.
వాములో థైమాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం రక్త నాళాలలో కాల్షియం చేరకుండా సహాయపడుతుంది. దీని వల్ల రక్త నాళాలు సున్నితంగా ఉండి దగ్గరికి ముడుచుకు పోకుండా ఉంటాయి. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలోనే అధికంగా హైబీపీ కారణంగా వచ్చే హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత సమస్యల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రక్త నాళాలల్లో పేరుకు పోయిన కొవ్వును తొలగించడంలో, హైబీపీ ని, రక్తంలో అధికంగా ఉండే చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్)ను తగ్గించడంలో వాము ఎంతో సహాయపడుతుంది.
వాములో ఉండే ఫ్లేవనాయిడ్స్, థైమాల్ అనే రసాయన సమ్మేళనాలు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, రక్త నాళాలలో ఉండే కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని విధాలుగా మేలు చేసే వామును ఎలా వాడాలి.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. 2 గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ వాము వేసి ఒక గ్లాసు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి వేడి వేడిగా తాగాలి. వాము నీరు చాలా రుచిగా ఉంటుంది. 20 రోజులు క్రమం తప్పకుండా ఈ నీటిని తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఈ వాము నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది.