హెల్త్ టిప్స్

ఈ డ్రింక్‌ను 3 వారాల పాటు తాగితే గుండె జ‌బ్బులు రావు..!

ఒకప్పుడంటే మ‌న పూర్వీకులు బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తింటూ నిత్యం త‌గినంత శారీర‌క శ్ర‌మ చేసేవారు కాబ‌ట్టి వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కానీ నేడు ఆ ప‌రిస్థితి లేదు. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్న మ‌నం త‌గినంత శారీర‌క శ్ర‌మ కూడా చేయ‌క‌పోతుండ‌డంతో ప‌లు అనారోగ్యాల‌కు కూడా గురి కావ‌ల్సి వ‌స్తోంది. వాటిలో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి గుండె జ‌బ్బులు. ర‌క్త నాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుండ‌డం మూలంగానే ఇలాంటి వ్యాధులు మ‌న‌కు వ‌స్తున్నాయి. అయితే కింద ఇచ్చిన ఓ ప‌వ‌ర్‌ఫుల్ డ్రింక్‌ను నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే దాంతో గుండె జ‌బ్బుల‌ను రాకుండా చూసుకోవ‌చ్చు. అంతేకాదు ర‌క్త నాళాల్లో ఎక్క‌డైనా కొవ్వు పేరుకుపోయి ఉంటే వెంట‌నే అది క్లియ‌ర్ అవుతుంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ కూడా త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పైన చెప్పిన మెడిసిన‌ల్ డ్రింక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…

నిమ్మ‌కాయ‌లు – 1 కిలో, బేకింగ్ సోడా ప్యాక్ – 1, కొత్తిమీర – 5, 6 క‌ట్ట‌లు, నీరు – 12 క‌ప్పులు.

take this lemon drink daily to prevent heart attack

త‌యారు చేసే విధానం…

నిమ్మ‌కాయ‌లను బాగా క‌డ‌గాలి. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని స్ట‌వ్‌పై ఉంచి త‌క్కువ హీట్‌తో వేడి చేయాలి. అందులో నిమ్మ‌కాయ‌లు, బేకింగ్ సోడా వేసి 60 నిమిషాల పాటు నెమ్మ‌దిగా ఉడికించాలి. అనంత‌రం కొత్త‌మీరను ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ఆ మిశ్ర‌మంలో వేయాలి. అలా 2-3 గంట‌లు ఉడికించాక స్ట‌వ్‌ను ఆర్పేసి ఆ మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌నివ్వాలి. దాన్ని ఒక జార్‌లో నిల్వ చేసుకుని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 4 టేబుల్ స్పూన్ల మోతాదులో 3 వారాల పాటు తీసుకోవాలి.

పైన చెప్పిన డ్రింక్‌ను గ‌నుక నిర్దేశిత రోజుల పాటు తీసుకుంటే దాంతో ర‌క్త నాళాల్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. గుండె జ‌బ్బులు రావు. బీపీ కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

Admin

Recent Posts