హెల్త్ టిప్స్

Almonds : బాదం ప‌ప్పును తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Almonds : వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, త‌ల‌లో దుర‌ద‌, చుండ్రు, జుట్టు నిర్జీవంగా మార‌డం, జుట్టు తెగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉన్నాయి. త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, జుట్టుకు పోష‌కాలు స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా స‌హ‌జ సిద్దంగా ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌ను మాత్ర‌మే ఈ చిట్కా త‌యారీకి ఉప‌యోగించాల్సి ఉంటుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈ చిట్కా ఏమిటి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం మెంతుల‌ను, పెరుగును, నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఇలా నాన‌బెట్టిన త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను గిన్నెలోకి తీసుకుని నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి.

taking almonds many wonderful health benefits

ముఖ్యంగా త‌ల చ‌ర్మానికి అంటేలా బాగా ప‌ట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వల్ల జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. చుండ్రు స‌మ‌స్య నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. జుట్టు పెరుగుద‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. జుట్టు అందంగా, కాంతివంతంగా త‌యారవుతుంది. త‌ల చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి అంద‌మైన‌, ఆరోగ్య‌వంత‌మైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts