ప్రస్తుత తరుణంలో చాలా మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. వారు అధిక బరువును తగ్గించుకునేందుకు యత్నిస్తున్నారు. ఇక కొందరు సన్నగా ఉన్నవారు తాము సన్నగా ఉన్నామని దిగులు చెందుతుంటారు. బరువు పెరగాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు నిత్యం అరటి కాయలను తినడం వల్ల బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
అరటికాయలు నిజానికి బరువు తగ్గేందుకు, పెరిగేందుకు రెండు విధాలుగా సహాయం చేస్తాయి. కాకపోతే వాటిని తీసుకునే విధానం వేరేగా ఉంటుంది. వాటిని నేరుగా తింటే బరువు తగ్గేందుకు సహాయ పడుతాయి. కానీ వాటిని పాలతో కలిపి తింటే బరువు పెరుగుతారు. డైటిషియన్లు కూడా ఇదే చెబుతున్నారు.
అరటి పండ్లను చాలా మంది వ్యాయామం చేశాక తింటారు. దీంతో అవి కోల్పోయిన శక్తిని అందిస్తాయి. బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. అరటి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్, పొటాషియంలు అధిక బరువు తగ్గేందుకు ఎంతగానో మేలు చేస్తాయి. అయితే అరటి పండ్లలో కార్బొహైడ్రేట్లు కూడా అధికంగానే ఉంటాయి. కనుక పాలతో అరటి పండ్లను తింటే బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
ఒక సాధారణ అరటి పండు ద్వారా 105 క్యాలరీల శక్తి లభిస్తుంది. 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, కొద్ది మొత్తాల్లో విటమిన్ బి6, సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు లభిస్తాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.
అరటి పండ్లలో కార్బొహైడ్రేట్లు ఉంటాయి. పాలలో ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల రెండింటినీ కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. కనుక సన్నగా ఉన్నామని బాధపడేవారు అరటి పండ్లు, పాలను కలిపి తీసుకోవడం మంచిది. బనానా మిల్క్ షేక్ చేసుకుని తాగవచ్చు. లేదా రెండింటినీ ఒకేసారి తీసుకోవచ్చు. అయితే ఇలా తీసుకునేవారు వ్యాయామం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. త్వరగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.