హెల్త్ టిప్స్

Chia Seeds : ఒంట్లో కొవ్వు ఎక్కువ‌గా ఉన్న‌వారు దీన్ని తాగితే కొవ్వు మ‌లం ద్వారా బ‌య‌ట‌కు పోతుంది..!

Chia Seeds : ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ గింజలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించారు. ప్రతి రోజు అరస్పూన్ చియా సీడ్స్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ గింజలను వేసి బాగా కలిపి రెండు గంటల పాటు అలా వదిలేస్తే ఆ గింజలు జెల్లీ మాదిరిగా ఉబ్బుతాయి. దీనిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తీసుకోవచ్చు. లేదంటే స్వీట్స్, ఫలుదా వంటి వాటిలో వేసుకొని తినవచ్చు.

అయితే టైమ్ ఎక్కువ ఉంది అనుకునే వారు ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల చియా సీడ్స్‌ను వేసి ఐదారు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. దీంతో అవి ఉబ్బిపోయి తెల్ల‌గా మారుతాయి. అప్పుడు కూడా వీటిని తీసుకోవ‌చ్చు. ఇలా వీటిని నాన‌బెట్టి తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. చియా గింజలలో 92 శాతం ఫైబర్ ఉంటుంది. ఈ గింజలలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం వంటి పోషకాలు చాలా సమృద్దిగా ఉంటాయి. ప్రతి రోజు ఈ గింజలను తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.

taking chia seeds daily can melt fat in body

జీర్ణ సంబంధ‌ సమస్యలను తగ్గిస్తుంది. ప్రేగు కదలికలకు సహాయపడి మలబద్ధ‌కం సమస్య లేకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారాలలో చియా గింజలు చాలా ఉత్తమమైనవని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడ‌మే కాకుండా రక్తపోటు స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి. చియా గింజలలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్‌ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తాయి. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చియా గింజలలో B విటమిన్లు, జింక్, ఐరన్, మెగ్నిషియం సమృద్దిగా ఉండుట వలన అలసట, నీరసం లేకుండా చేస్తాయి.

చియా గింజలలో కాల్షియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్ సమృద్దిగా ఉండుట వలన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఎముకలు గుల్లగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న చియా సీడ్స్ ని రోజూ ఆహారంలో త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
Admin

Recent Posts