Ulavalu : చాలామంది, ఈ రోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే, ఆహార పదార్థాల మీద శ్రద్ధ పెడుతున్నారు. మాంసం కంటే, ఉలవలులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకని ఎక్కువ మంది ఉలవలను తీసుకుంటూ ఉంటారు. శాకాహారులు మాంసాన్ని తీసుకోరు. కాబట్టి, ఉలవలు తీసుకోవడం మంచిది. ఇందులో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఉలవల్లో క్యాల్షియం, ప్రోటీన్, ఐరన్ తో పాటుగా ఫాస్ఫరస్ అలానే ఇతర పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. నీరసం వంటివి రాకుండా ఉలవలు చూస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఆహారంలో ఉలవలను తీసుకోవడం మంచిది. ఉలవల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి.
ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువ ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళకి, ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఒక కప్పు ఉడికించిన ఉలవల్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు వేసుకుని తీసుకున్నట్లయితే, సన్నబడడానికి అవుతుంది శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గుతుంది. ఉలవలు తీసుకోవడం వలన అసలు కొవ్వు చేరదు. చాలామంది, చిన్నవయసులో డయాబెటిస్ వలన బాధపడుతున్నారు.
ఆహారంలో ఉలవల్ని చేర్చుకోవడం వలన, చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఉలవల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎదిగే పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరం నిర్మాణాన్ని బాగా జరిగేటట్టు ఉలవలు చూస్తాయి. ఉలవల్లో ఆకలి పెంచే గుణాలు కూడా ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు, వారానికి మూడుసార్లు ఉలవలను తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.
కడుపులో నులిపురుగులని నివారించడానికి కూడా ఉలవలు ఉపయోగపడతాయి. ఉలవల కషాయాన్ని తీసుకుంటే, ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉలవల కషాయాన్ని పాలల్లో కలుపుకుని తాగితే, నులిపురుగులు నశిస్తాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఉలవలు తీసుకుంటున్నారు. మీరు కూడా, మీ డైట్ లో ఉలవల్ని చేసుకుంటే, ఈ సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు.