Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే పండు ఇది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Admin by Admin
March 14, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సోడియం, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, మెగ్నిషియం, ఐర‌న్‌, పీచు ప‌దార్థం, జింక్‌, కాపర్‌, ఫొలేట్‌, విట‌మిన్ ఎ, సి, డి, కె1, బి12, బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు… ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా..? అవేనండీ, నిత్యం మ‌నం తినే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో ఉండే పోష‌కాలివి. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏయే పోష‌కాన్ని తీసుకుంటే ఎలాంటి ర‌కాల లాభాలు క‌లుగుతాయో దాదాపుగా అంద‌రికీ తెలిసే ఉంటుంది. అయితే పైన చెప్పిన పోష‌కాల‌న్నీ మ‌న‌కు ఏదో ఒక ఆహార ప‌దార్థం తిన‌డం వ‌ల్ల ల‌భించేవే. కానీ అవ‌న్నీ ఒకే ప‌దార్థంలో ల‌భిస్తే..? దానికి మించిన అద్భుత‌మైన పోష‌కాహారం ఇంకేముంటుంది. అదిగో, అలాంటి ప‌దార్థ‌మే కివీ. కివీ పండు. న్యూజిలాండ్‌లో ఎక్కువగా పండే కివీలు మ‌న ద‌గ్గ‌ర ఇప్పుడు విరివిగా ల‌భిస్తున్నాయి.

డెంగీ వ‌చ్చిన వారు వీటిని ఇప్పుడు ఎక్కువ‌గా తింటున్నారు. అందుకు కార‌ణం ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే. అయితే కేవ‌లం డెంగీ అనే కాదు, కివీ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం. రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి అధిక శాతం వరకు తగ్గిస్తాయి. శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తెలిసింది. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.

taking kiwi can increase libido in men

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను తొలగిస్తుంది. పిల్లలకు కనీసం వారానికి ఒక సారి కివీ పండ్లను ఇస్తే దగ్గు, జలుబు వంటి అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచేలా చేయవచ్చు. గుండెకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.

రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. కివీ పండులో ఉండే జింక్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్లు, గోళ్లు తదితరాల పెరుగుదలకు జింక్ దోహదం చేస్తుంది.

Tags: kiwi fruitlibidosexual stamina
Previous Post

మీ కిడ్నీలను శుభ్రం చేసుకోవడానికి దివ్యౌషదం. మీ ఇంట్లో మీరే తయారు చేసుకోవ‌చ్చు..

Next Post

టూత్ బ్ర‌ష్ ను ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మార్చాలో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.