హెల్త్ టిప్స్

శృంగార సామర్థ్యాన్ని పెంచే వెజిటేరియన్ ఆహారాలు ఇవే..!

మారుతున్న జీవనశైలి.. ఒత్తిడి.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుత తరుణంలో స్త్రీ, పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో శృంగారంపై ఆసక్తి కూడా ఉండడం లేదు. అయితే ఈ సమస్యకు కింద తెలిపిన పలు వెజిటేరియన్ ఆహారాలు అత్యుత్తమ పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు శృంగారంపై ఆసక్తి కూడా కలుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. అరటి పండ్లు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిల్లో ఉండే విటమిన్ బి, ట్రిప్టోఫాన్, పొటాషియం, బ్రొమెలీన్ తదితర సమ్మేళనాలు జననావయవాలకు రక్తసరఫరాను పెంచుతాయి. దీంతో శృంగార సమస్యలు పోతాయి.

బీట్‌రూట్‌లలో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. నిత్యం బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. మూడ్ మారుతుంది. శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎరుపు రంగు ద్రాక్షల్లో స్టిల్బెనాయిడ్లు, రెస్‌వెరట్రాల్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిత్యం 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగే వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాఫీలో ఉండే సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు శృంగారం పట్ల ఆసక్తిని పెంచుతాయి.

taking these vegetarian foods can increase sexual stamina

నిమ్మజాతికి చెందిన పండ్లు, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, బీన్స్, ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్, గుమ్మడికాయలు, మొక్కజొన్న తదితర ఆహారాల్లో విటమిన్ బి, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయి.

Admin

Recent Posts