హెల్త్ టిప్స్

Tamarind Seeds : ఇన్ని రోజులూ చెత్త కుండీలో వేశారు.. ఇవి వజ్రాలతో సమానం.. ఇకపై తప్పు చేయకండి..!

Tamarind Seeds : చింత గింజలను సహజంగానే చాలా మంది పడేస్తుంటారు. చింతపండును ఉపయోగించాక అందులో ఉన్న గింజలను పడేస్తుంటారు. అయితే వాస్తవానికి చింత గింజలతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చింతగింజలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. వీటితో అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. చింతగింజలతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చింతగింజల్లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక ఫ్రీ ర్యాడికల్స్‌ నిర్మూలించబడతాయి. దీంతో షుగర్, క్యాన్సర్‌ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గింజల్లో ఉండే ఫినోలిక్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌ మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు సైతం అధికంగానే ఉంటాయి. అందువల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో ఆయా నొప్పులను తగ్గించుకోవచ్చు.

tamarind seeds do not throw them away

ఈ గింజలు చర్మాన్ని సైతం సంరక్షిస్తాయి. వీటిల్లో యాంటీ ఏజింగ్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటి పొడిని వాడితే చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మృదువుగా ఉంటుంది. దీంతో యవ్వనంగా ఉంటారు. చర్మం తన సాగే గుణాన్ని కోల్పోదు, దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. ముఖంపై ముడతలు కనిపించవు. ఈ గింజలు జీర్ణ సమస్యలకు సైతం చక్కగా పనిచేస్తాయి. వీటితో జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే మలబద్దకం ఉండదు. గ్యాస్‌ తగ్గుతుంది.

ఈ గింజలను వాడడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. అందువల్ల వీటిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. దీంతో డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. ఫలితంగా కిడ్నీలు, కళ్లు, లివర్‌ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రావు. ఇలా చింత గింజలతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వీటిని వాడుకోవాలి. దీంతో అనుకున్న ఫలితాలు వస్తాయి.

Admin

Recent Posts