Thati Bellam : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. కరోనా మహమ్మారి వంటి వాటితో పోరాడాలంటే తప్పనిసరిగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి కనుక చాలా మంది పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా రసాయనాలతో పండించిన వాటిని పక్కన పెట్టి ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో తాటి బెల్లం ఒకటి అని చెప్పవచ్చు. మరి తాటి బెల్లంలో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందామా..!
1. తాటి బెల్లం పూర్తిగా ఆర్గానిక్ కావడంతో ఇందులో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి. అధిక మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉండటమే కాకుండా ఇవి త్వరగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
2. తాటి బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
3. తాటి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో దెబ్బతిన్న కణాల పునరుత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో ఏ విధమైన మలినాలు పేరుకుపోయినా అవి తొలగిపోతాయి. ఆయా వ్యవస్థలు శుభ్రంగా మారుతాయి. ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
4. తాటి బెల్లంలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. వాటి వల్ల పోషణ లభిస్తుంది.
5. మైగ్రేన్ వంటి అధిక తలనొప్పి సమస్య ఉన్నవారు తాటిబెల్లంను తింటే ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా ఈ బెల్లాన్ని తింటే అధిక బరువును తగ్గించుకోవచ్చు.