ప్రస్తుత తరుణంలో ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా చాలా మంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇది సంతాన సాఫల్యతపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. అలాగే వీర్యం కూడా సరిగ్గా ఉత్పత్తి కావడం లేదు. దీంతో చాలా మంది దంపతులకు పిల్లలు పుట్టడం లేదు. లేదా ఆలస్యం అయినా జరుగుతోంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు చాలా మంది పురుషులు వయాగ్రా వాడుతారు. కానీ దీర్ఘకాలంలో వయాగ్రా తీవ్రమైన దుష్పరిణామాలను కలగజేస్తుంది. అందుకని సహజసిద్ధమైన పద్ధతుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు గాను కింద తెలిపిన నాలుగు రకాల పండ్లు ఎంతగానో దోహదపడతాయి.
ఈ పండ్లను తినడం వల్ల పురుషుల్లో వయాగ్రా వేసినట్లు అవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇక ఆ పండ్లు ఏమిటంటే.. మనకు ఇప్పుడు ఏ సీజన్‌లో అయినా సరే పుచ్చకాయలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే పురుషులకు పుచ్చకాయ ఒక వరమనే చెప్పవచ్చు. వీటిల్లో నైట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. కనుక పుచ్చకాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ పండును తింటే వయాగ్రా వేసినట్లు పనిచేస్తుంది. దీంతో పురుషులు ఆ కార్యంలో రెచ్చిపోతారు. సంతానం కలిగే చాన్స్ పెరుగుతుంది. పుచ్చకాయలను రోజూ తింటే మేలు జరుగుతుంది.
నారింజ పండ్లు కూడా పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచగలవు. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. దీని వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. కనుక నారింజ పండును రోజుకు ఒకటి తినాలి. అలాగే అరటి పండ్లు కూడా పురుషుల శృంగార సామర్థ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి పండ్లను తరచూ తింటుంటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అరటి పండ్లును తింటే శక్తి కూడా లభిస్తుంది. కనుక శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు.
దానిమ్మ పండ్లు కూడా సహజసిద్ధమైన వయాగ్రా మాదిరిగా పనిచేస్తాయి. ఈ పండ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. ఇది పురుషులకు ఎంతగానో మేలు చేసే విషయం. దీని వల్ల పురుషులలో శక్తి పెరుగుతుంది. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. కనుక ఈ పండ్లను తింటుంటే పురుషులకు ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.