Zinc Rich Foods : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో జింక్ కూడా ఒకటి. ఇతర పోషకాల వలె జింక్ కూడా మన శరీరంలో వివిధ విధులను నిర్వర్తిస్తుంది. కానీ నేటి తరుణంలో మనలో చాలా మంది జింక్ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో తగినంత జింక్ లేకపోవడం వల్ల మనం వివిధ అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో జింక్ మనకు దోహదపడుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లను తగ్గించడంలో జింక్ సహయపడుతుంది. శరీరంలో జింక్ లోపించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శరీరంలో తగినంత జింక్ లేనందున మనం డయోరియా వంటి జీర్ణ సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే జుట్టు రాలడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం, చర్మం దెబ్బతినడంతో పాటుగా కంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మన శరీరంలో తగినంత జింక్ ఉండేలా చూసుకోవాలి.
రోజూ పురుషులకు 11 మిల్లీ గ్రాములు, స్త్రీలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరమవుతుంది. జింక్ లోపం నుండి బయటపడడానికి చాలా మంది జింక్ సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల మనం వివిధ రకాల దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. జింక్ సప్లిమెంట్స్ కు బదులుగా జింక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జింక్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో శనగలు కూడా ఒకటి. శనగల్లో 2.5 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. శనగల్లో జింక్ తో పాటు ఐరన్, సెలినియం, మాంగనీస్, ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది.
శనగలను తీసుకోవడం వల్ల జింక్ లోపం నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే పప్పు దినుసులు, ఎండు గింజల్లో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు గింజల్లో 4. మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. కనుక రోజూ ఆహారంలో గింజలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి. ఇక గుమ్మడి గింజల్లో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది. 28 గ్రాముల గుమ్మడి గింజల్లో 2.2 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జింక్ తో పాటు ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. రోజూ గుప్పెడు గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల జింక్ లోపం రాకుండా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే పుచ్చగింజల్లో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అదే విధంగా జింక్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో జనపనార గింజలు కూడా ఒకటి. ఒక టేబుల్ స్పూన్ జనపనార గింజల్లో ఒక మిల్లీ గ్రాము జింక్ ఉంటుంది. ఈ గింజలను పెరుగుతో తీసుకోవచ్చు. అలాగే సలాడ్స్ లో కూడాచల్లుకుని తినవచ్చు. ఇక రాజ్మా, బ్లాక్ బీన్స్ వంటి వాటిలో కూడాజింక్ ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన బీన్స్ లో 0.9 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. అలాగే కొవ్వు లేని పెరుగును తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి జింక్ లభిస్తుంది. ఒక కప్పు పెరుగులో 1.5 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. అలాగే డార్క్ చాక్లెట్, జీడిపప్పు, ఓట్స్ వంటి వాటిలో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జింక్ లోపం తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుంది. అలాగే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం జింక్ తో పాటు ఇతర పోషకాలను కూడా పొందవచ్చు.