Sleep : మన శరీరానికి తగినంత నిద్ర చాలా అవసరమని మనకు తెలిసిందే. రోజూ 8 గంటల పాటు నిద్రించడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు చేకూరుతాయి. రోజూ 8 గంటల పాటు నిద్రించడం వల్ల మనకు కలిగే కొన్ని ముఖ్యమైన లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. శరీరం చల్లబడుతుంది. అలాగే పగటిపూట కంటే రాత్రి పూట మెదడు చురుకుగా పని చేస్తుంది. రాత్రి పూట మెదడు 20 నుండి 30 శాతం ఎక్కువ గ్లూకోజ్ ను గ్రహిస్తుంది. దీంతో మెదడు కణాలు శుభ్రపడి చురుకుగా పని చేస్తాయి. అదే విధంగా 20 సంవత్సరాల లోపు పిల్లలు చాలా త్వరగా పెరుగుతుంటారు. శరీరంలో ఎముక పెరుగుదల రాత్రి పూట ఎక్కువగా ఉంటుంది. కనుక పిల్లలు తగినంత నిద్రించడం చాలా అవసరం.
పిల్లలు సరిగ్గా నిద్రించకపోవడం వల్ల వారిలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. రోజూ 8 గంటల పాటు నిద్రించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రాత్రి పూట కండరాలు విశ్రాంతిని తీసుకుంటాయి. రక్తనాళాల్లో రక్తప్రవాహం కూడా తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. దీని వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే ఎక్కువగా నిద్రించడం వల్ల శరీరంలో కండరాలు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటాయి. ఎక్కువగా నిద్రించడం వల్ల ఎక్కువ సేపు పని చేయడానికి కండరాలు మనకు తోడ్పడతాయి. కండరాలల్లో పేరుకుపోయిన మలినాలు కూడా తొలగిపోతాయి. కండరాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటానికి నిద్రకు మించిన మంచి మందు లేదు. రాత్రి పూట మెదడు చురుకుగా పని చేస్తుంది. దానిలో దాగి ఉన్న కొన్ని సంఘటనలు మనకు కలల రూపంలో బయటకు వస్తాయి. కొన్ని కలలు మనకు చేదు అనుభూతిని ఇచ్చినప్పటికి కొన్ని మనకు మంచి అనుభూతిని ఇస్తాయి. ఇలా మంచి అనుభూతిని ఇచ్చే కలల వల్ల మనం ఎంతో ఆనందానికి గురి అవుతాము.
రాత్రి చక్కగా నిద్రించడం వల్ల మాత్రమే మనకు ఈ ఆనందం కలుగుతుంది. అదే విధంగా రోజూ చక్కగా నిద్రించడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేయకపోతే మరుసటి రోజుకు అది పని చేయలేకపోతుంది. దీంతో మనకు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అలాగే రాత్రి వేళల్లో చర్మం కింద ఉండే కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. కొలాజెన్ ఎంత ఎక్కువగా ఉండే చర్మం అంత ఎక్కువగా ముడతలు పడకుండా యవ్వనంగా కనబడుతుంది. తగినంత నిద్రించడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కనుక మనం రోజూ 8 గంటల పాటు నిద్రించడం చాలా అవసరం. మనం తక్కువగా నిద్రించడం వల్ల ఈ లాభాలన్నీ మనం కోల్పోతాము. కనుక ప్రతి ఒక్కరు 8 గంటల పాటు నిద్రించాలని అప్పుడే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.