Tips For Belly Fat | చాలామంది, ఈరోజులలో, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, అధిక బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా పొట్ట చుట్టూ ఉండే, కొవ్వు కారణంగా ఇబ్బంది పడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కొవ్వు పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. దీనిని కరిగించడానికి, రకరకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది కరగకపోతే కచ్చితంగా ప్రమాదమే. ఎక్కువసేపు కూర్చుని పని చేసే వాళ్లకి, నడుము చుట్టూ కూడా కొవ్వు బాగా పేరుకు పోతుంది.
కొవ్వు ఎక్కువైనట్లయితే బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్, మతిమరుపు ఇలా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. నడుము దగ్గర రింగు కొవ్వుతో బాధపడే వాళ్లు, ఇలా చేయడం మంచిది. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగేందుకు, ఈ రింగు కొవ్వు కారణంగా మారగలదు. మహిళల్లో పొట్ట 35 అంగుళాలకు మించి ఉంటే, రింగు కొవ్వు ఉన్నట్లు అర్థం. అదే పురుషుల్లో 40 అంగుళాలకి మించి ఉన్నట్లయితే, రింగు కొవ్వు ఉన్నట్లు. ఈ రింగు కొవ్వు పోవాలంటే ఏవేవో చాలా మంది చేస్తూ ఉంటారు.
వ్యాయామలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రింగు కొవ్వుని తొలగించాలంటే, వ్యాయామలు చేయడం మంచిదే. అలానే నడవండి. మీ పనులు మీరే చేసుకోండి. నడుం బాగా వంగేలా చూసుకోండి. బరువు తగ్గుతూ ఉన్నట్లయితే, రింగు కొవ్వు కూడా తగ్గిపోతూ ఉంటుంది. భోజనం చేసిన వెంటనే కూడా నడవండి.
ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామలు చేయండి. నెల రోజుల్లో మీరే మార్పులు చూస్తారు. బరువు తగ్గుతూ ఫిట్నెస్ ని కూడా పెంచుకుంటారు. సిట్ అప్స్, పుష్ అప్స్, యోగా ఇలాంటివన్నీ కూడా మీరు చేయవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు…? ఈ రోజే మొదలు పెట్టండి. ఇలా చేస్తే, సులభంగా కొవ్వు నుండి దూరంగా ఉండొచ్చు. బరువు కూడా ఈజీగా తగ్గుతారు.