Cholesterol : కొలెస్ట్రాల్ అదుపులో ఉండ‌డం లేదా.. అయితే ఈ అల‌వాట్ల‌ను మానేయాల్సిందే..!

Cholesterol : మ‌న శ‌రీరానికి కొలెస్ట్రాల్ కూడా చాలా అవ‌స‌రం. హార్మోన్ల త‌యారీలో, విట‌మిన్ డి త‌యారీలో ఇలా అనేక ర‌కాలుగా కొలెస్ట్రాల్ మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే నేటి త‌రుణంలో మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది హృద‌య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కొన్ని సార్లు ఇది ప్రాణాంత‌కంగా కూడా మారుతుంది. క‌నుక కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండాలంటే ఇప్పుడు చెప్పే నియమాల‌ను పాటించ‌డం చాలా అవ‌స‌రం. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు పాటించాల్సిన నియ‌మాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డానికి అధిక బ‌రువు కూడా ఒక కార‌ణం. శ‌రీరం యొక్క బ‌రువు పెరిగితే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. క‌నుక స‌మ‌తుల్య ఆహారాన్ని తీసుకుంటూ శ‌రీర బ‌రువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని ద‌రి చేర‌కుండా చూసుకోవాలి. దీర్ఘ‌కాలిక ఒత్తిడి శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను పెంచ‌డ‌మే కాకుండా గుండె ఆరోగ్యంపై కూడా ప్ర‌భావాన్ని కూడా చూపిస్తుంది. క‌నుక ధ్యానం, యోగా వంటి వాటిని చేస్తూ ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. అధికంగా ఆల్క‌హాల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ తో పాటు ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

unfollow these habits if you want to manage your Cholesterol levels
Cholesterol

క‌నుక ఆల్కాహాల్ ను మితంగా తీసుకోవ‌డం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచుకోవాల‌నుకునే వారు పోష‌కాలు క‌లిగిన అల్పాహారాన్ని తీసుకోవాలి. అలాగే మ‌నం తీసుకునే ఆహ‌రంలో మంచి కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. అవ‌కాడో, కోడిగుడ్డు తెల్ల‌సొన వంటి వాటిని తీసుకోవాలి. స‌మ‌తుల్య‌మైన ఆహారాన్ని తీసుకోవ‌డంతో పాటు నూనెలో వేయించిన ఆహారాల‌కు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను విప‌రీతంగా పెంచుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది. క‌నుక ఫాస్ట్ ఫుడ్ కు, జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. అదే విధంగా శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. నీటిని ఎక్కువ‌గా తాగాలి.

దీని వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గ‌డంతో పాటు ర‌క్త‌నాళాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండాల‌నుకునే వారు ప్రోటీన్ ను ఎక్కువ‌గా తీసుకోవాలి. చేప‌లు, చిక్కుళ్లు, గింజ‌లు వంటి వాటిని తీసుకోవ‌డం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను ఎక్కువ‌గా పెంచే వాటిలో ధూమపానం కూడా ఒక‌టి. ధూమ‌పానం కార‌ణంగా హృద‌య ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది. క‌నుక దీనిని వ‌దిలేయ‌డం మంచిది. చివ‌ర‌గా ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా ఈ నియమాల‌ను పాటించ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు శ‌రీర పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts