మీరు కీళ్లలో పదునైన, బాధాకరమైన నొప్పులను అనుభవిస్తున్నారా ? ఇది యూరిక్ యాసిడ్ యొక్క అధిక స్థాయికి సంకేతం కావచ్చు. యూరిక్ యాసిడ్ అనేది కొన్ని ఆహారాలను విచ్ఛిన్నం చేసేటప్పుడు మన శరీరం ఉత్పత్తి చేస్తుంది మరియు అది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అది కీళ్లలో స్థిరపడుతుంది మరియు అన్ని రకాల అసౌకర్యాలను కలిగిస్తుంది. సాధారణంగా, యూరిక్ యాసిడ్ స్థాయిలు 3.5 నుండి 7.2 mg/dL మధ్య ఉండాలి, కానీ అది పెరిగితే, కొంత చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అయితే శరీరంలో ఎక్కువగా ఉండే యూరిక్ యాసిడ్ నిల్వలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అందుకు గాను ఇప్పుడు చెప్పబోయే 6 రకాల డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఆ డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేందుకు గాను విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. వాటిల్లో నిమ్మరసం మొదటి వరుసలో నిలుస్తుందని చెప్పవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగుతుంటే యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోవచ్చు.
అలాగే పాలలో పసుపు కలుపుకుని తాగుతున్నా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గిపోతాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాపులను తగ్గిస్తాయి. దీంతో యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు కీరదోస జ్యూస్‌ను తాగుతున్నా కూడా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పుచ్చకాయ జ్యూస్, అల్లం రసం లేదా టీ, గ్రీన్ టీ వంటి వాటిని తీసుకుంటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో కీళ్లలో ఉండే నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.