Cholesterol : మనం వంటల్లో అనేక రకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాము. ఎంతో కాలంగా వంటల్లో మసాలా దినుసులను వాడుతూ ఉన్నాము. మసాలా దినుసులు వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మసాలా దినుసులను వాడడం వల్ల నయం అయ్యే సమస్యలల్లో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. నేటి తరుణంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్యకు ప్రధాన కారణం. కొలెస్ట్రాల్ కారణంగా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే మసాలా దినుసులను వాడడం వల్ల సహజ సిద్దంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచే మసాలా దినుసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించడంలో మనకు దాల్చిన చెక్క ఎంతగానో సహాయపడుతుంది. ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే మెంతిగింజలను వాడడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మెంతిఆకులు, గింజలు ఫైబర్ ను కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలతో పాటు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండే పసుపును తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల సమస్య తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉండే అల్లాన్ని వాడడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కొత్తిమీర కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. వంటల్లో కొత్తిమీరను వాడడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇక చక్కటి వాసనను కలిగి ఉండే యాలకులను వాడడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటితో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఉసిరికాయలను వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే భారతీయ వంటకాలు, ఆయుర్వేదంలో ఉపయోగించే కళోంజి విత్తనాలను వాడడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా ఈ మసాలా దినుసులను వంటల్లో వాడడం వల్ల మనం చాలా సులభంగా కొలెస్ట్రాల్ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.