Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

శిరోజాల సమస్యలు తగ్గి జుట్టు బాగా పెరగాలంటే ఈ నూనెలను వాడాలి..!

Admin by Admin
June 1, 2021
in హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

తల మీద శిరోజాలు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి. కానీ కొందరికి వెంట్రుకల సమస్యలు ఉంటాయి. దీంతో వారు శిరోజాలు అందంగా కనిపించేలా చేసుకునేందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్తుంటారు. కానీ అందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే పలు సహజసిద్ధమైన నూనెలతోనే శిరోజాలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో అవి అందంగా కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే నూనెలతో కొద్దిసేపు మర్దనా చేసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. వెంట్రుకల సమస్యలు ఉండవు. రోజూ ఈ నూనెలతో 5 నిమిషాల పాటు మర్దనా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

use these oils for hair problems and hair growth

కొబ్బరినూనె

కొబ్బరినూనెతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దాదాపుగా అన్ని రకాలైన శిరోజాలకు ఈ నూనె ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. దీంతో తలలో ఈ నూనె సులభంగా ఇంకుతుంది. చుండ్రును నివారించే ఫ్యాటీ యాసిడ్లు ఈ నూనెలో ఉంటాయి. ఇవి శక్తివంతంగా పనిచేస్తాయి. కొబ్బరినూనెలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం తదితర మినరల్స్‌ ఉంటాయి. ఇవి శిరోజాలకు పోషణను అందిస్తాయి. శిరోజాలు కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.

బాదం నూనె

ఈ నూనెలో విటమిన్‌ ఇ అధికంగా ఉంటుంది. జుట్టుకు ఈ నూనె రక్షణను అందిస్తుంది. జుట్టుపై ఒక షీల్డ్‌లా పనిచేస్తుంది. పేలవంగా కనిపించే జుట్టుకు ఈ నూనె కాంతినిస్తుంది. మెగ్నిషియం, కాల్షియం తదితర పోషకాలు కూడా ఈ నూనెలో ఉంటాయి. అందువల్ల ఈ నూనెతో శిరోజాలను మర్దనా చేస్తే జుట్టు శుభ్రంగా మారుతుంది. తలస్నానం చేసేముందు ఈ నూనెను బాగా మర్దనా చేయాలి. దీంతో జుట్టులో ఉండే దుమ్ము, ధూళి పోయి జుట్టు శుభ్రంగా మారుతుంది.

ఉసిరి నూనె

ఉసిరినూనె వాడడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఈ నూనెను వాడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. రాత్రి నిద్రించేముందు కొద్దిగా నూనెలకు తలకు మర్దనా చేసి నిద్రించాలి. నిద్ర చక్కగా పడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. దీంతో శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

ఆముదం

ఆముదంలో విటమిన్‌ ఇ, మినరల్స్‌, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జుట్టుకు ఈ నూనెను వాడితే పోషణ లభిస్తుంది. జుట్టు సమస్యలు తగ్గుతాయి. తలలో ఉండే బాక్టీరియా, ఫంగస్‌లు నశిస్తాయి. జుట్టులో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ నూనెను రాస్తే జుట్టుపై ఎక్కువ సేపు ఉంటుంది. కనుక జుట్టు సిల్కీగా కనిపిస్తుంది. వెంట్రుకలు చిట్లిపోకుండా ఉంటాయి. ఇతర నూనెలతో పోలిస్తే ఆముదం ద్వారా కొంత జిడ్డు ఎక్కువగా ఉంటుంది. కానీ శిరోజాలకు ఇది మేలు చేస్తుంది. జుట్టు పెరిగేందుకు సహాయ పడుతుంది. ఈ నూనెను జుట్టుకు బాగా రాశాక తల చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌ను చుట్టాలి. దీంతో నూనె తలలో బాగా ఇంకుతుంది. తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయి.

ఆలివ్‌ నూనె

శిరోజాల పోషణకు, జుట్టు పొడిబారకుండా ఉండేందుకు, పలుచగా ఉన్న జుట్టు బాగా పెరిగేందుకు, జుట్టు రాలిపోకుండా ఉండేందుకు ఆలివ్‌ నూనె బాగా పనిచేస్తుంది. ఆలివ్‌ నూనెను కొద్దిగా తీసుకుని వేడి చేసి దాన్ని తలకు బాగా పట్టించాలి. తరువాత వేడినీటిలో పిండిన టవల్‌ను తల చుట్టూ 20 నిమిషాల పాటు చుట్టి ఉంచాలి. తరువాత తలస్నానం చేయాలి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు బాగా పెరుగుతుంది.

ఇంట్లో లభించే నూనెలను గోరు వెచ్చగా చేసి జుట్టుకు మర్దనా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సమయం, డబ్బు ఆదా చేయవచ్చు. గోరు వెచ్చని నూనె వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. మెత్తగా నిగనిగలాడుతుంది. ఆయా నూనెల్లో గుడ్డు సొన, వెనిగర్‌, నిమ్మరసం వంటి పదార్థాలను కలుపుకుని కూడా వాడుకోవచ్చు. దీంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. నూనెలను తలకు బాగా మర్దనా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. తలలో వచ్చే దురద తగ్గుతుంది. చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.

అరకప్పు ఆలివ్‌నూనెలో రెండు కప్పుల గోరు వెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి. తలకు రాసిన నూనె బాగా ఆరిపోయిన తరువాత స్నానం చేయాలి. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది. ఎప్పుడూ మెత్తగా ఉంటుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.

రెండు టీస్పూ్న్ల కొబ్బరినూనెలో ఒక టీస్పూన్‌ నిమ్మరసం కలిపి దాంతో తలకు బాగా మర్దనా చేయాలి. అరగంట తరువాత స్నానం చేయాలి. దీంతో జుట్టు పునరుజ్జీవం పొందుతుంది. దెబ్బ తిన్న జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: dandruffhair carehair growthhair healthhair losshair oilshair problemsచుండ్రుజుట్టు పెరుగుద‌ల‌జుట్టు రాల‌డంశిరోజాల ఆరోగ్యంశిరోజాల స‌మ‌స్య‌లుశిరోజాల సంర‌క్ష‌ణ‌హెయిర్ ఆయిల్స్
Previous Post

ఔషధ గుణాల కలబంద.. దీంతో ఏయే అనారోగ్యాలు తగ్గుతాయంటే..?

Next Post

ఏయే సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను కలవాలి..? తెలుసుకోండి..!

Related Posts

హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
హెల్త్ టిప్స్

మీరు రోజూ తినే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. క‌చ్చితంగా బ‌రువు త‌గ్గుతారు..

June 2, 2025
హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు వీటిని డైట్‌లో క‌చ్చితంగా చేర్చుకోవాల్సిందే..!

June 2, 2025
హెల్త్ టిప్స్

40 ఏళ్లు దాటిన వారు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ఇవి..!

June 2, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!