రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని తమ వంట ఇంటి పదార్థాల్లో ఒకటిగా ఉపయోగిస్తూ వస్తున్నారు&period; ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి&period; ఆయుర్వేద ప్రకారం&period;&period; వెల్లుల్లి మ్యాజికల్‌ స్పైస్‌గా చెప్పబడుతోంది&period; ఇందులో మన శరీర నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉంటాయి&period; దీన్ని నిత్యం ఆహారంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిలో విటమిన్‌ బి1&comma; బి2&comma; బి3&comma; బి6&comma; ఫోలేట్‌&comma; మెగ్నిషియం&comma; పాస్ఫరస్‌&comma; సోడియం&comma; జింక్‌&comma; ఐరన్‌&comma; మాంగనీస్‌&comma; కాల్షియం తదితర అద్భుతమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి&period; అందువల్ల వెల్లుల్లి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది&period; అలాగే వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్‌ అనబడే సమ్మేళనం మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది&period; దీంతో బాక్టీరియా&comma; వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-66911" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;roasted-garlic&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">రోగ నిరోధక శక్తికి వెల్లుల్లిని ఇలా వాడాలి&&num;8230&semi;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనకు మార్కెట్‌లో వెల్లుల్లి సప్లిమెంట్ల రూపంలోనూ దొరుకుతోంది&period; దీంతో కొందరు ఆ ట్యాబ్లెట్లను మింగుతుంటారు&period; ఇక కొందరు వెల్లుల్లి రెబ్బలను మింగుతారు&period; అయితే అలా కాదు&period; వెల్లుల్లి రెబ్బలను 2&comma; 3 తీసుకుని ఉదయాన్నే పరగడుపునే అలాగే బాగా నమిలి మింగాలి&period; దీని వల్ల నోట్లోనే ఆల్లిసిన్‌ తయారవుతుంది&period; అది జీర్ణాశయంలోకి వెళ్లగానే శరీరం దాన్ని శోషించుకుంటుంది&period; ఇక వెల్లుల్లిని నమలకుండా మింగినా&comma; ట్యాబ్లెట్ల రూపంలో వాడినా ఫలితం ఉండదు&period; ఆల్లిసిన్‌ నోట్లో విడుదల కాదు&period; జీర్ణాశయంలో విడుదలయ్యే టైముకు యాసిడ్లు దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి&period; దీంతో ఆల్లిసిన్‌ మనకు అందదు&period; ఫలితంగా మనం అనుకున్న ప్రయోజనం నెరవేరదు&period; కనుక వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని అలాగే బాగా నమిలి మింగితే&period;&period; మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని&period;&period; న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిని నేరుగా నమిలితినలేని వారు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి సలాడ్లు&comma; సూప్‌లలో వేసుకుని తీసుకోవచ్చు&period; అయినప్పటికీ ఆ ముక్కలను బాగా నమిలి మింగితేనే ప్రయోజనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వెల్లుల్లి రెబ్బలను నిత్యం పచ్చిగానే నమిలి తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది&period; దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి&period; అలాగే లివర్‌లో పేరుకుపోయే హానికారక వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి&period; తరచూ మనకు ఇబ్బందులను కలగజేసే దగ్గు&comma; జలుబు&comma; ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది&period; డయాబెటిస్‌ వ్యాధి ఉన్నవారిలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి&period; ఇక నిత్యం ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలను పరగడుపునే నమిలి తినడం వల్ల ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts