Voma Danda : చిన్న‌పిల్ల‌ల‌కు వేసే ఓమ‌దండ‌.. అంటే ఏమిటి..? దీన్ని పిల్ల‌ల‌కు వేస్తే ఏమ‌వుతుంది..?

Voma Danda : చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మన ఇంట్లోనే ఉంటుంది. ఇన్ని రకాల ఇంగ్లిష్‌ మందులు రాకముందు మన పూర్వీకులు ప్రతిదానికి వంటగదిలోని పదార్దాల పైనే ఆధార పడేవారు. దెబ్బ తగిలితే పసుపు పెట్టడం.. దగ్గుకు పసుపు పాలు.. మిరియాలు.. వాము.. ఇలా అనేక రకాల పదార్దాలను వాడేవారు. అయితే ప్రకృతి సహజమైన వ్యాధి నిరోధకంగా ఓమ ఎంతో బాగా పనిచేస్తుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం రైతు కుటుంబాల్లో ప్రతిరోజూ రాత్రివేళ భోజనం చేశాక పిడికెడు వాము నమిలి మింగడం చాలామందికి అలవాటుగా ఉండేది.

ఇప్పటికీ మన ఇళ్లల్లో బాలింతల చేత వాము నమిలిపిస్తుంటారు. వాము వల్ల ఒక మోస్తరు దగ్గు, అజీర్తి సమస్యలన్నీ తగ్గిపోతాయి. 60 శాతం రోగాలకు కేంద్రం జీర్ణాశయమే కాబట్టి వాము తినడం వల్ల వారిలో ఉండే చాలా రకాల జీర్ణాశయ వ్యాధులు తగ్గేవి. కొంతమంది చిన్న పిల్లలు శ్వాసకోశాల్లో కఫం బాగా పెరిగిపోవడం వల్ల దగ్గు, ఆయాసంతో బాధపడుతుంటారు. గొంతులోంచి పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎన్ని రకాల మందులు వాడినా ఉపశమనం లభించదు. అలాంటి సందర్భాల్లో ఒక గజం పొడవు వ‌స్త్రాన్ని తీసుకుని ప్రతి నాలుగు అంగుళాలకు ఒక చోట ఒక అరచెంచా వాము వేసి మూటగా కడుతూ ఒక దండ తయారు చేయాలి.

Voma Danda how it is beneficial to children
Voma Danda

ఆ దండను పిల్లల మెడలో వేస్తే నిరంతరం అది ముక్కుకు దగ్గరగా ఉండడం వల్ల వాము వాసన శ్వాసకోశాల్లోకి వెళ్లి దగ్గు, ఆయాసాల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది. మందులు పోస్తున్న‌ ప్రతిసారి పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. ఈ విథంగా చేస్తే వారి మెడలో ఉన్న దండను చూసుకుని పిల్లలు మురిసిపోతారు. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే దీన్ని చిన్నారులే కాదు.. పెద్ద‌లు కూడా వాడ‌వ‌చ్చు. దీంతో శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts