Wake Up Works : నేటి తరుణంలో మనలో చాలా మంది ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. మారిన మన జీవన విధానమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం రోజూ ఉదయం 7 గంటల లోపే నిద్రలేవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 7 గంటల లోపు నిద్రలేచి ఈ 7 సులువైన పనులు చేయడం వల్ల మనం మన రోజుని సంతోషంగా, ఉత్సాహంగా గడపవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ 7 పనులు చేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు.
రోజూ మనం ఉదయం 7 గంటల లోనే చేయాల్సిన 7 పనుల గురించి అలాగే ఇవి మన ఆరోగ్యానికి ఎలాంటి మేలును కలిగిస్తాయో… ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉదయమే లేచి నీటిని తాగాలి. నీటిని తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే శరీరంలో 30 శాతం జీవక్రియ రేటు పెరుగుతుంది. అలాగే నిద్రలేచిన తరువాత రెండు గంటల వరకు ఎలాంటి ఫోన్స్ ను లేదా డిజిటల్ పరికరాలను ఉపయోగించకూడదు. వీటిని ఉపయోగించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మనం పని చేసే సామర్థ్యం తగ్గుతుంది. కనుక ఉదయం లేచిన వెంటనే ఫోన్ వంటి వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. అదేవిధంగా ఉదయం త్వరగా నిద్రలేచి వ్యాయామం వంటివి చేయాలి. వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. శరీరం ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది.
అలాగే వ్యాయామంతో పాటుగా ఉదయం పూట మెడిటేషన్ వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శరీరం మొత్తానికి మేలు కలుగుతుంది. అలాగే ఉదయం త్వరగా నిద్రలేచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ఉత్తేజం కలుగుతుంది. మీలో సృజనాత్మక పెరుగుతుంది. మీ రోజును మీరు గొప్పగా ప్రారంభించవచ్చు. అలాగే రోజులో మీరు చేయాల్సిన పనులను ముందుగానే నిర్దారించుకోవాలి. నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకోవడం వల్ల మనం ఆ పనులను సులభంగా చేసుకోగలుగుతాము. అలాగే ఉదయాన్నే తలస్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు రిఫ్రెష్ అవుతారు. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరాన్ని, మనసును మేల్కొల్పడానికి తలస్నానం అనేది ఒక చక్కటి మార్గమని చెప్పవచ్చు.ఈవిధంగా ఉదయాన్నే లేచి ఈ 7 పనులను చేయడం వల్ల మన శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.