నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వ్యాయామాల్లో అన్నింటి కన్నా చాలా తేలికైంది వాకింగ్. వాకింగ్ చేసేందుకు మనకు ఎలాంటి సామగ్రి అవసరం ఉండదు. అలా బయటకు వెళ్లి కొంత సేపు వాకింగ్ చేసి తిరిగి ఇంటికి రావచ్చు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలని వైద్యులు చెబుతుంటారు. కానీ కొంచెం ఎక్కువ సమయం పాటు.. అంటే.. 1 గంట పాటు వాకింగ్ చేస్తే ఇంకా అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిత్యం గంట పాటు వాకింగ్ చేస్తే మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.
2. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సరిగ్గా ఆడుతుంది. శ్వాస సమస్యలు ఉండవు. ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి.
3. నిత్యం గంట పాటు వాకింగ్ చేయడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు 40 నుంచి 50 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
4. వాకింగ్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. ఎముకలు విరిగే అవకాశాలు 40 శాతం వరకు తగ్గుతాయి.
5. కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. కీళ్లలో సైనోవియల్ ఫ్లుయిడ్ పెరుగుతుంది. శరీరంలో సహజంగానే ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ సమ్మేళనాలు చురుగ్గా పనిచేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల సమస్యలు ఉండవు.
6. వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వృద్ధాప్యంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయి.
7. వాకింగ్ వల్ల అధిక బరువు తగ్గుతారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 60 శాతం వరకు తగ్గుతాయి. షుగర్ ఉన్నవాళ్లకు అయితే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
8. శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. పెద్ద పేగు ఆరోగ్యంగా ఉంటుంది.
9. వాకింగ్ చేయడం వల్ల కండరాలు క్షీణించకుండా ఉంటాయి. డీఎన్‌ఏకు మరమ్మత్తులు జరుగుతాయి. కణాలు సురక్షితంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు రావు.