Walnuts : మనకు తినేందుకు ఎన్నో రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వాల్ నట్స్ ఒకటి. ఇవి మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా పురుషులు వీటిని రోజూ తినాలి. ఇవి అంత పెద్దగా రుచిగా ఉండవు. కానీ రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. పురుషులు వీటిని రోజుకు గుప్పెడు మోతాదులో తింటే చాలు.. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. వాల్ నట్స్‌ను రోజూ తినడం వల్ల పురుషులకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్ నట్స్‌ను రోజూ తినడం వల్ల పురుషుల్లో వచ్చే అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. ముఖ్యంగా వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వాల్ నట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల పడకగదిలో రెచ్చిపోతారు. అంగస్తంభన సమస్య ఉండేవారు వాల్ నట్స్‌ను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో చురుగ్గా శృంగారంలో పాల్గొంటారు.
వాల్ నట్స్‌ను రోజూ 30 గ్రాముల మోతాదులో.. అంటే దాదాపుగా గుప్పెడు మోతాదులో తినడం వల్ల పురుషుల్లో రక్త సరఫరా మెరుగు పడిందని, వీర్యంలో నాణ్యత పెరిగిందని గుర్తించారు. అలాగే టెస్టోస్టిరాన్ లెవల్స్ 10 శాతం పెరిగినట్లు నిర్దారించారు. అందువల్ల వాల్ నట్స్‌ను రోజూ పురుషులు తింటే శృంగార పరంగా అన్ని రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు. వాల్ నట్స్‌ను తినడం వల్ల వీర్యం ఎక్కువగా తయారవుతుంది. శుక్ర కణాలు నాణ్యంగా ఉంటాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
ఇక వాల్ నట్స్‌ను రోజూ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరిగిందని నిర్దారించారు. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.