Walnuts With Milk : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది చిన్న పనికే అలసిపోతున్నారు. కొద్ది దూరం నడవగానే ఆయాస పడిపోతున్నారు. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతున్నారు. నీరసం, బలహీనత, శరీరంలో నిస్సత్తువతో బాధపడుతన్నారు. పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల చేత ఇలా శరీరంలో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. దీని వల్ల మనం ఏ పని కూడా చురుకుగా చేయలేకపోతాము. అలాగే ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతాము. అలాంటి వారు ఒక చిన్న చిట్కాను ఉపయోగించి చాలా సులభంగా శరీరాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు. రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు. నీరసం, బలహీనతలను తగ్గించే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం వాల్ నట్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. వాల్ నట్స్ మనందరికి తెలిసినవే.
వీటిని తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అలాగే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనకు కావల్సిన రెండో పదార్థం ఎండు ద్రాక్ష. ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోతాయి.

నీరసంగా, సన్నగా, శరీర బలహీనతతో బాధపడే వారు ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు వీటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాల్ నట్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసి కలపాలి. ఇప్పుడు ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించి గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచి కొరకు ఒక టీ స్పూన్ తేనె లేదా అర టీ స్పూన్ పటిక బెల్లం పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పాలను రోజూ ఉదయం అల్పాహారం చేసిన రెండు గంటల తరువాత తీసుకోవాలి.
ముందుగా వాల్ నట్స్ ను, ఎండు ద్రాక్షను తిని ఆ తరువాత పాలను తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.