Young : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందికి వయసు పెరిగే కొద్ది ఆరోగ్యం తగ్గుతూ వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వయసు పైబడే చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలా ఆరోగ్యం తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కలుషితమైన గాలి, నీరు, ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన ఆహారాలను తీసుకోవడం వల్ల, రసాయనాలు అధికంగా వాడిన ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చెబుతూ ఉంటారు. అలాగే హైబ్రిడ్ ఆకుకూరలు, హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని మరికొందరు చెబుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం పాడవడం నిజమే అయినప్పటికి మన ఆరోగ్యం పాడవడానికి ప్రధాన శత్రువు మన మనసే అని నిపుణులు చెబుతున్నారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మన మనసును మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఆలస్యంగా లేవమని మన మనసకు అనిపిస్తుంది. దీంతో మనం ఆలస్యంగా లేస్తాము. అలాగే వ్యాయామం తరువాత చేద్దాంలే అని మన మనసుకు అనిపించిన వెంటనే మనం వ్యాయామం చేయడం మానేస్తాము. అలాగే ఉదయం పూట నీరు తాగకుండా టీ, కాఫీలను తాగాలని రుచికరమైన అల్పాహారాలను తీసుకోవాలని అనిపించిన వెంటనే మనం వాటిని తీసుకుంటూ ఉంటాము. అలాగే జంక్ ఫుడ్ తినాలనిపించడం, కూరల్లో ఉప్పు, నూనె, కారం ఎక్కువగా వేసుకుని తినాలనిపించడం ఇలా మన మనసుకు ఏది తినాలనిపిస్తే మనం అది తినడం వల్ల ముఖ్యంగా మన ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మనం మన మనసును మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అలాగే చాలా మంది అనారోగ్యానికి గురి అయ్యి శరీరం విశ్రాంతిని కోరుకున్నప్పుడు కూడా మందులు వేసుకుని పని చేస్తూ ఉంటారు. ఇలా మన మనసు ఏది చెబితే అది చేయడం వల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుందని మన మనసే మన ప్రధాన శత్రువు అని నిపుణులు చెబుతున్నారు. మన మనసు ఆధీనంలో మనం ఉండకూడదని మన ఆధీనంలో మన మనసు ఉండాలని మనం చెప్పినట్టు మన మనసు వినాలని ఇది అందరూ గమనించాలని వారు చెబుతున్నారు. మన బుద్ది మన మనసుకు మంచి ఆహారాలను తీసుకోమని దిశానిర్దేశం చేసేలా మనం మన అలవాట్లను మార్చుకోవాలని చెడు అలవాట్లజోలికి వెళ్లకుండా మనం మనసును అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మన మనసును నియంత్రణలో ఉంచుకుని చక్కటి అలవాట్లను పాటించడం వల్ల చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వయసు పెరిగినప్పటికి మనం ఆరోగ్యంగా ఉండగలమని నిపుణులు చెబుతున్నారు.