అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాలుగా యత్నిస్తున్నారు. పౌష్టికాహారం తినడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదని కొందరు విచారిస్తుంటారు. అయితే అధిక బరువు తగ్గేందుకు కింద తెలిపిన 7 సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధిక బరువు తగ్గాలంటే పౌష్టికాహారం తినడంతోనే సరిపోదు. దాన్ని సమయానికి తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌లను సమయానికి చేయాలి. సమయం తప్పి భోజనం చేస్తే అందులో పౌష్టికాహారం తీసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు. కనుక వేళకు భోజనం చేస్తేనే అందులో ఉండే పోషకాలు మనకు అందుతాయి. దీంతో బరువు తగ్గవచ్చు.
2. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంకు మధ్యలో సాయంత్రం పూట చాలా మంది స్నాక్స్ రూపంలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. కానీ అవి బరువును తగ్గించవు సరికదా, బరువును పెంచుతాయి. కనుక వాటికి బదులుగా పండ్లు, నానబెట్టిన గింజలను తినాలి. దీంతో పోషకాలు అందుతాయి. పైగా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
3. రోజూ ఆహారాల్లో తీపి, పులుపు, చేదు, ఉప్పు, వగరు, కారం.. ఈ ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి. అంటే ఈ ఆరు రుచులు కలిగిన ఆహారాలను రోజూ తినాలి. ఇవి శరీరంలోని దోషాలను సమతుల్యం చేస్తాయి. దీంతో బరువు తగ్గవచ్చు.
4. ప్రస్తుతం మారుతున్న జీవన స్థితిగతులతో చాలా మంది రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడాన్ని నియమంగా పెట్టుకున్నారు. త్వరగా భోజనం చేయడం లేదు. ఆలస్యంగా భోజనం చేస్తే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా అధికంగా బరువు పెరుగుతారు. కనుక రాత్రి పూట 7.30 గంటల లోగా భోజనాన్ని ముగిస్తే మంచిది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
5. కొందరు రోజూ బయటి ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కనుక ఇంటి భోజనాన్నే తినాలి. బయట భోజనం చేయాల్సి వస్తే ఇంటి నుంచి బాక్స్ తీసుకెళ్లాలి. కానీ బయటి ఆహారాలను తినరాదు.
6. రోజంతా గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
7. ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడమే కాదు, తగినంత నిద్ర కూడా అవసరమే. రాత్రి 10 గంటల వరకు నిద్రించాలి. ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలి. ఈ అలవాటును పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అధిక బరువు తగ్గుతారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365