Watermelon Seeds For Height : మనలో చాలా మంది తగినంత ఎత్తు ఉంటే బాగుంటూ అని కోరుకుంటూ ఉంటారు. పురుషులు ఎక్కువగా ఆకు అడుగులు ఉండాలని, స్త్రీలు ఐదున్నర అడుగుల ఎత్తు వరకు ఉండాలని కోరుకుంటారు. ఎత్తు విషయానికి వస్తే పురుషులు 20 నుండి 21 సంవత్సరాల వరకు ఎత్తు పెరుగుతారు. అదే స్త్రీలు 19 సంవత్సరాల వయసు వరకు ఎత్తు పెరుగుతారు. అలాగే ఎత్తు పెరగడమనేది మన జీన్స్ పై కూడా ఆధార పడి ఉంటుంది. మన పూర్వీకులు ఎత్తుగా ఉంటే మనం కూడా ఎత్తుగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎత్తుగా ఉండాలని ఎముకలకు సంబంధించిన సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.
ఇలా సర్జరీలు చేయించుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎత్తు పెరగాలనుకుంటే అది వయసులో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. సరైన ఆహారం, వ్యాయామం చేయడం వల్ల ఎత్తు పెరగవచ్చు. గ్రోత్ హార్మోన్ ను థైరాయిడ్ గ్రంథి విడుదల చేస్తుంది. కనుక థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి. అలాగే శరీరానికి తగినంత విటమిన్ డి అందేలా చూసుకోవాలి. రోజూ ఎండలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎండలో ఉండడం కుదరని వారు విటమిన్ డి క్యాప్సుల్స్ ను ఉపయోగించాలి. అలాగే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. 20 సంవత్సరాల లోపు ఉండే వారు రోజుకు 600 మిల్లీగ్రాముల క్యాల్షియం శరీరానికి అందేలా చూసుకోవాలి.
అలాగే ఎదిగే వయసులో ఉండే పిల్లలు శరీరానికి తగినంత ప్రోటీన్ కూడా అందేలా చూసుకోవాలి. కిలో బరువుకు రెండు గ్రాముల ప్రోటీన్ చొప్పున తీసుకోవాలి. నానబెట్టిన పల్లీలు, మొలకెత్తిన గింజలను, పుచ్చగింజల పప్పును, పొద్దు తిరుగుడు పప్పును, గుమ్మడి గింజల పప్పును, బాదంపప్పును తీసుకోవాలి. అలాగే వారానికి రెండు సార్లు మీల్ మేకర్ ను తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. ఇలా తీసుకుంటూనే థైరాయిడ్ గ్రంథి పనితీరును పెంచే సర్వాంగాసన్, చక్రాసన్, మత్సాసన్, యోగా ముద్రాసన్ వంటి ఆసనాలను చేయాలి. వీటితో పాటు రోజూ గంట పాటు వ్యాయామం చేయాలి. ఇలా ఆహారాలను తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల తప్పకుండా వయసులో ఉన్న పిల్లలు ఎత్తు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.