హెల్త్ టిప్స్

వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ ను తినేస్తున్నామట.. ఓ ఏటీఎం కార్డు బరువంత కడుపులోకి..!

ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఈ భూతమే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు.. మనుషులకు కూడా హానీ కలిగిస్తోంది. ప్రపంచాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రస్తుతం పట్టి పీడిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూకాజిల్ సర్వే ప్రకారం.. మనుషులు తమకు తెలియకుండానే ప్లాస్టిక్ ను తినేస్తున్నారట.

అంటే.. వారానికి ఒక ఏటీఎం కార్డు బరువున్నంత ప్లాస్టిక్ ను తినేస్తున్నారట. కడుపులోకి పంపిస్తున్నారట. ఎక్కువగా నీళ్ల ద్వారానే ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తుందట. కేవలం నీళ్ల ద్వారానే 1769 ప్లాస్టిక్ కణాలు మనిషి కడుపులోకి వెళ్తున్నాయట.

అయితే.. కేవలం నీళ్ల ద్వారానే కాదు.. షెల్ ఫిష్ అనే జీవుల ద్వారా కూడా మనిషి శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్తోందట. షెల్ ఫిష్ అంటే నీళ్లలో గుల్లలో ఉండే జీవులు. వాటిని తినడం ద్వారా కూడా ప్లాస్టిక్ మనిషి కడుపులోకి పోతోందట.

we are eating 5 grams of plastic approximately per week

వీళ్ల సర్వేలో భాగంగా… యూఎస్ లో నల్లా నీళ్ల శాంపిల్స్ తీసుకున్నారట. అందులో 9.4 శాతం శాంపిల్స్ లో ప్లాస్టిక్ ఫైబర్ ఉందట. అంటే ఒక లీటర్ నీటిలో 9.6 శాతం ఫైబర్ ఉంటుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.

అయితే.. ప్లాస్టిక్ కాలుష్యం.. యురోపియన్ దేశాల్లోని నీటిలో కాస్త తక్కువే ఉంటుందని రీసెర్చర్లు వెల్లడించారు. అక్కడ లీటర్ నీటిలో 3.8 శాతం ప్లాస్టిక్ ఫైబర్ మాత్రమే ఉందట.

Admin
Published by
Admin
Tags: plastic

Recent Posts