Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

Admin by Admin
July 4, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారతీయ వంటగదిలో మిరియాలు కచ్చితంగా ఉంటాయి. మిరియాలు ఏ వంటకంలో వేసినా దాని టేస్ట్‌ను డబుల్‌ చేస్తాయి. మిరియాల రసం అయితే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జలుబు చేసినప్పుడు ఇదే గొప్ప మెడిసిన్‌లా పని చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాల కారణంగా, ఆరోగ్య ప్రయోజనాల పరంగా.. నల్ల మిరియాలను శతాబ్దాలుగా మన వంటల్లో వాడుతున్నాం. మిరియాలను బ్లాక్‌గోల్డ్ అని కూడా పిలుస్తారు. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మిరియాలను మన రోజూవారీ డైట్‌లో కొంచెం చేర్చుకున్నా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూసేయండి.​

మిరియాల్లోని పెపరిన్‌ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. ఫలితంగా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర ఆహారాలతో పాటు మీ డైట్‌లో మిరియాలు తీసుకోవడం వల్ల విటమిన్లు B, C, సెలీనియం, బీటా-కెరోటిన్ వంటి అవసరమైన పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది ఈ పోషకాల జీవ లభ్యతను పెంచుతుంది, అవి శరీరం బాగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. బెర్రీలు, వేరుసెనగలో ఉండే రెస్‌వెరాట్రాల్‌ వంటి ప్రయోజనకర పదార్థాలను మెరుగ్గా శోషించుకునే సామర్థ్యం మిరియాల వల్ల మన శరీరానికి అందుతుంది. గుండె జబ్బు, క్యాన్సర్‌, అల్జీమర్స్‌, డయాబెటిస్‌, వంటి రుగ్మతల నుంచి రెస్‌వెరాట్రాల్‌ రక్షిస్తుంది. అయితే పేగులు శోషించుకునేలోగానే ఈ పదార్థం విచ్ఛిన్నమవుతుంటుంది. శరీరంలో దీని లభ్యతను పెంచడంలో మిరియాలు దోహదపడతాయి.

we should definitely take black pepper in diet know why

నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, గ్యాస్ , మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇది ఆహారం నుంచి అవసరమైన పోషకాలను శరీరం సమర్ధవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది. మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, చెడు బ్యాక్టీరియాను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. అధిక ఆకలిని నియంత్రిస్తాయి. మిరియాలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్‌, కెరోటినాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పైపరైన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది మిరియాలకు ఘాటైన వాసన, రుచి ఇస్తుంది. శరీరంలోని హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే యాంటీఆక్సిడెంట్‌గానూ ఇది పనిచేస్తుంది. . గుండె జబ్బులు, క్యాన్సర్‌, ఉబ్బసం, డయాబెటిస్‌, చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రాకుండా.. అడ్డుకుంటుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

రొమ్ము, ప్రోస్టేట్‌, పెద్ద పేగు క్యాన్సర్‌ కణాల పునరుత్పత్తిని పైపరైన్‌ తగ్గించినట్లు, క్యాన్సర్‌ కణాలు చనిపోయేలా చేసినట్లు ప్రయోగాల్లో తేలింది. ట్రిపుల్‌ నెగెటివ్‌ రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో పైపరైన్‌ అత్యంత సమర్థమైందని శాస్త్రవేత్తలు తేల్చారు. క్యాన్సర్‌ కణాల్లో బహుళ ఔషధ నిరోధకతను తగ్గించే సామర్థ్యమూ పైపరైన్‌కు ఉంది. ఇలాంటి నిరోధకత వల్ల కీమోథెరపీ సమర్థత తగ్గుతుంది. మిరియాలలోని పైపెరిన్‌ యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ప్రో-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. మిరియాలు ఆర్థరైటిస్, ఆస్తమా, వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. నల్ల మిరియాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి, తద్వారా కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. పైపెరిన్ థర్మోజెనిసిస్‌ను మెరుగుపరుస్తుంది, ఈ ప్రక్రియ ద్వారా శరీరం వేడిని ఉత్పత్తి చేస్తుంది, కేలరీలను బర్న్‌ చేస్తుంది. అదనంగా, నల్ల మిరియాలు కొవ్వు కణాల నిర్మాణాన్ని అణిచివేస్తాయి, బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Tags: black pepper
Previous Post

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

Next Post

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

Related Posts

vastu

పడక గది ఏ మూలన ఉంటే మీకు మంచి జరుగుతుందో తెలుసా?

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధా విగ్రహం ఎలా ఉంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

July 13, 2025
వైద్య విజ్ఞానం

ఉమ్మిని మింగ‌డం మంచిదా..? లేదా ప‌దే ప‌దే ఊసేయాలా..?

July 13, 2025
చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

July 13, 2025
హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.