అధిక బరువు తగ్గాలంటే నిత్యం వ్యాయామం చేయడం ఎంత అవసరమో సరైన పోషకాలు కలిగిన పౌష్టికాహారం తీసుకోవడం కూడా అంతే అవసరం. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు సరైన పౌష్టికాహారం ఏదో తెలుసుకోలేకపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను నిత్యం తింటే.. దాంతో అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. వీటిని రోజూ రాత్రి తీసుకునే భోజనానికి బదులుగా తినాలి. దీంతో చాలా త్వరగా బరువు తగ్గుతారు.
* స్ట్రాబెర్రీలు చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. 100 గ్రాముల స్ట్రాబెర్రీలను తింటే కేవలం 33 క్యాలరీలు మాత్రమే వస్తాయి. పైగా కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. దీంతో ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గవచ్చు. కనుక రాత్రి పూట భోజనానికి బదులుగా వీటిని తింటే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.
* రాత్రి పూట భోజనంలో ఎరుపు రంగు క్యాప్సికంను కూడా తినవచ్చు. ఇవి కూడా చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. అందువల్ల శరీరానికి తక్కువ శక్తి రాత్రి పూట లభిస్తుంది. అలాగే ఆకలి కాకుండా ఉంటుంది. దీంతో బరువు తగ్గుతారు.
* పుట్టగొడుగులు అధిక బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని రాత్రి పూట భోజనంలో తింటే మంచిది. అలాగే పలు పోషకాలు కూడా మనకు వీటివల్ల లభిస్తాయి.
* అధిక బరువును తగ్గించే ఉత్తమమైన ఆహారాల్లో కీరదోస కూడా ఒకటి. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి కూడా కాదు. దీంతో బరువు తగ్గవచ్చు.
* అధిక బరువును తగ్గించడంలో కాలిఫ్లవర్ కూడా బాగానే పనిచేస్తుంది. రాత్రి పూట భోజనంలో కాలిఫ్లవర్‌ను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. అలాగే శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.