పని ఒత్తిడి, ప్రయాణాలు , కుటుంబ పరిస్థితులు సెక్సువల్ లైఫ్ కు ఆటంకం కలిగించొచ్చు… ఈ కారణాల వల్ల భాగస్వామితో కలవడం మానేసినట్టయితే ఏం జరుగుతుందో తెలుసా.. ఒత్తిడి పెరుగుతుంది.రెండు వారాలపాటు సెక్సులో పాల్గొననట్టయితే మైండ్ ఆబ్సెంట్ గా ఉండి చేస్తున్న పనులపై ధ్యాస ఉండక ఒత్తిడి ఫీల్ అవుతాం అంట…ఇంక నలుగురితో మాట్లాడేప్పపుడు ఇబ్బంది పడతామంట..దీనికి కారణం సెక్సులో పాల్గొనడం వల్ల మన మైండ్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఎండార్పిన్,ఆక్సిటోసిన్ మన మైండ్ ను రిలాక్స్ చేస్తాయి. అమెరికన్ యురాలాజికల్ అసోసియేషన్ పరిశోధనల ప్రకారం సెక్సులో పాల్గొనని పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. సెక్సులో పాల్గొనడం వలన రిలీజ్ అయ్యే కెమికల్స్ ప్రోస్టేట్ లో ఉండే హానికర పదార్థాలను తొలగించడానికి తోడ్పడతాయి.
సెక్సులో పాల్గొనే వాళ్లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుండని పెన్సిన్వేలియా యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు.సెక్సులో పాల్గొననట్టయితే వారిలో జలుబు, ప్లూతో ఎక్కువగా బాదపడ్తుంటారట… వైరస్ లకు , జెర్మ్ లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి వీరి శరీరంలో తక్కువగా ఉంటుందట. ఏ వస్తువైనా వాడకపోతే నిరుపయోగంగా మారినట్టే… పురుషుడి అంగం కూడా వారంలో కనీసం రెండు సార్లు సెక్సులో పాల్గొనకపోతే తర్వాత కాలంలో అంగస్తంభన కష్టమవుతుందట..
సెక్సు అనేది పురుషులకు సంభందించిందే అని, ఆడవాళ్లకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని.. ఉన్నాకూడా బిడియంతో చెప్పకుండా ఉంటారు.. కానీ సెక్సులో పాల్గొనన్టయితే ఆడవాళ్లు డిప్రెషన్ కు లోనవుతారట..