Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే దీన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

Admin by Admin
June 14, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అతి ఆలోచన ప్రస్తుత బిజీ తరంలో అతి సాధారణ సమస్య అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంపై ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఉన్న సమస్యలు కావచ్చు, వాటికి కావాల్సిన పరిష్కారాలు కావొచ్చు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఇది మామూలే కదా అనుకుంటే చిక్కుల్లో పడక తప్పదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అతిగా ఆలోచించడం ఎంత అతి సాధారణం అనుకుంటున్నామో ఇది మన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపడం కూడా అతి సాధారణమని నిపుణులు చెప్తున్నారు. అతిగా ఆలోచించడం మన ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందంటున్నారు. దీనిని ముందే గుర్తించి అతిగా ఆలోచించడా మానుకోవడం, లేదా వైద్యులను సంప్రదించడం మంచిదని చెప్తున్నారు. అతిగా ఆలోచించడానికి అడ్డుకట్ట వేయడం అంత తేలిక కాదని, అందుకు ప్రతి ఒక్కరికీ ఉండే సమస్యలే కారణమని చెప్తున్నారు.

ఒక సమస్యకు పరిష్కారం లభించింది అనుకునేలోపే మరో సమస్య వస్తుంటుందని, అందువల్ల ఓవర్ థింకింగ్‌ను తగ్గించడం అంత సులభం కాదని చెప్తున్నారు. అయితే సమస్య గురించి కాకుండా.. దాని పరిష్కారం కోసం ఆలోచించాలని చెప్తున్నారు. అలా కాకుండా సమస్యలనే తలచుకొని కూర్చుంటే అందులో పడి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు వైద్యులు. అతిగా ఆలోచించడాన్ని మానుకోవడం కష్టం కానీ.. గుర్తించడం అంత కష్టమైన పనేమీ కాదని నిపుణులు అంటున్నారు. ఒక ఘటన, సమస్య, పరిస్థితి ఇలా ఏదైనా ఒకే దాని గురించి పదేపదే ఆలోచిస్తూ ఉంటే దాన్నే అతిగా ఆలోచించడం అంటారు. అలా చేయడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు కదా పైగా అందులోనే చిక్కుకుపోయి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. సమస్య చిన్నదే అయినా దాని పరిష్కారం కోసం చేసే ఆలోచన మాత్రం తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది. గోటితో పోయే దాని కోసం అతిగా ఆలోచించి గొడ్డలి దాకా తెచ్చుకోవడమే అతిఆలోచన సమస్య ఫలితం.

what happens if you over think

ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండటమే కాకుండా.. ఒకదానికి మరొక సమస్యను కలుపుకుని దానికి ఇంకేదో విషయాన్ని కూడా ఆలోచించడం మొదలు పెట్టడమే అతిగా ఆలోచించడం. దీనిని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని, అవి పాటించినా తగ్గని సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఔషదాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్న మాట. అలా కాదని ఉత్తి ఆలోచనే కదా అని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు నిపుణులు. జరిగిపోయిన విషయం గురించో.. జరగాల్సిన దాని గురించో ఆలోచిస్తూ చింతించే కన్నా ఇప్పుడు జరగాల్సిన దానిపై దృష్టి పెట్టడం మంచిది. ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. అలా ఉంటే ఎవరు ఏమనుకుంటారో అన్న ఆలోచనను వదిలి మీకు నచ్చినట్టు మీరు ఉండాలి. ప్రతికూల, నెగిటివ్ థాట్సే అతి ఆలోచనకు ప్రధాన, ప్రాథమిక కారణం అవుతాయి.

అలా కాకుండా అంతా మంచే జరుగుతుంది అన్నట్లు సానుకూలంగా ఆలోచించడం వల్ల అతి ఆలోచనను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అలా ఆలోచించేలా మన మనసును రెడీ చేయాలి. అంతేకాకుండా ఒత్తిడిని మరిచి ఎంజాయ్ చేయడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెప్తున్న మాట. అతి ఆలోచన, ఒత్తిడికి ప్రతిరోజూ ఉదయాన్నే చేసే కొద్దిసేపటి ధ్యానం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు, ఒక విధమైన పాజిటివ్ ఫీలింగ్ మనలో పెరుగుతుందని వైద్యులు చెప్తున్న మాట. 15 నిమిషాల ధ్యానం ఒత్తిడి, అతి ఆలోచనను దూరం చేస్తుందా అని అనుకోవచ్చు. కానీ ఉదయాన్నే చేసే 15 నిమిషాల ధ్యానం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, ఇది మానసిక ఒత్తిడినే కాకుండా ఎన్నో రుగ్మతల నుంచి కూడా మనల్ని కాపాడుతుందని అంటున్నారు నిపుణులు.

Tags: over think
Previous Post

ఒకే ఒక్కడు ! విమాన ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడు?

Next Post

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!