చియా విత్తనాలు చూసేందుకు అచ్చం సబ్జా గింజల మాదిరిగానే ఉంటాయి. కానీ రెండూ వేర్వేరు. అయితే రెండూ ఒకేలా పనిచేస్తాయి. అంటే నీటిలో వేస్తే జెల్ లాగా మారుతాయి. ఈ క్రమంలో అలాంటి చియా సీడ్స్‌ను తింటే మనం అనేక లాభాలను పొందవచ్చు. అనేక వ్యాధులను నయం చేసేందుకు చియా విత్తనాలను మనం తినవచ్చు. ఈ విత్తనాల్లో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే అనేక లాభాలను పొందుతారు.
అయితే దేన్ని కూడా అతిగా తినరాదు అన్న విషయం మాదిరిగానే చియా విత్తనాలను కూడా అతిగా తీసుకోరాదు. రోజుకు 1 లేదా 2 టీస్పూన్లు మాత్రమే వీటిని తినాలి. అంతకు మించితే పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చియా విత్తనాలను తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో, అతిగా తినడం వల్ల అన్నే నష్టాలు కూడా కలుగుతాయి.
చియా విత్తనాలను మరీ అధికంగా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, మలబద్దకం వస్తాయి. అలాగే వీటిని అధికంగా తింటే రక్తం మరీ పలుచగా మారే అవకాశం ఉంటుంది. దీంతో మనం వేసుకునే మెడిసిన్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. అలాగే ఈ విత్తనాలను లో బీపీ ఉన్నవారు తింటే బీపీ మరింత పడిపోయే చాన్స్ ఉంటుంది. కనుక వారు ఈ విత్తనాలను తినకూడదు. కొందరికి అలర్జీలు ఉంటాయి. అలాంటి వారు కూడా చియా విత్తనాలను తినకూడదు.