హెల్త్ టిప్స్

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

పర్ఫ్యూమ్ వినియోగం ప్రస్తుతం షరా మామూలయిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పర్ఫ్యూమ్ వాడుతూనే ఉంటారు. కాగా చాలా మంది ఈ పర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేసేసుకుంటారు. ఇలా చేయడం మన చర్మంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. పర్ఫ్యూమ్ అన్నీ కూడా రకరకాల రసాయనాలను కలిపి తయారు చేస్తారు. ఈ రసాయనాలు డైలీ నేరుగా చర్మంపై పడటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దానికి తోడు చాలా మంది పర్ఫ్యూమ్‌ను ప్రతి రోజూ దాదాపుగా ఒకే ప్రదేశంలో కొడుతుంటారు.. ఇలా చేయడం రిస్క్‌ను మరింత పెంచుతాయని అంటున్నారు నిపుణులు. అలాగని రోజుకోచోట పర్ఫ్యూమ్ వినియోగించాలని కాదు. వీలైతే వీటిని మన దుస్తులపై వాడుకోవాలని చెప్తున్నారు. ఇంతకీ పర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మంపై వాడితే ఏమవుతుందో తెలుసా.. మరి రండి తెలుసుకుందాం.

పర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మంపై అప్లై చేయడం అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. పర్ఫ్యూమ్‌లలో ఉండే ఆల్కహాల్.. మన చర్మంలో ఉండే తేమను గ్రహిస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోయి.. అనేక రకాల చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. పర్ఫ్యూమ్‌లలో ఉండే న్యూరోటాక్సిన్స్ మన నాడీవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఇదే విధంగా పర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మంపై రోజూ అప్లై చేయడం వల్ల.. చర్మం చికాకుకు గురవుతుంది. ఇది సున్నితమైన చర్మంపై హానికరమైన ప్రభావం చూపుతుంది. పర్ఫ్యూమ్‌లను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చర్మ వ్యాధులే కాకుండా హార్మోన్లలో అసమతుల్యత వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. పర్ఫ్యూమ్‌లో సువాసన కోసం వాడే రసాయనాలు ఈ హార్మోన్ల సమస్యకు ప్రధాన కారణమవుతాయి. అదే విధంగా చర్మ క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయని నిపుణులు వివరిస్తున్నారు.

what happens if you use perfume excessively

చాలా వరకు పర్ఫ్యూమ్‌లలో థాలేట్స్, స్టైరిన్, గెలాక్సోలైడ్స్, గ్లైకాగ్స్ వంటి సమ్మెళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి అధికంగా వచ్చి చేరితే.. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా మరెన్నో అలెర్జీలకు, బ్యాక్టీరియాకు మన శరీరం నెలవుగా మారుతుంది. కనుక‌ చాలా వరకు పర్ఫ్యూమ్ లు వాడే అలవాటు ఉన్నవారు వాటిని దుస్తులపై అప్లై చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా తరచుగా పర్ఫ్యూమ్‌ల వినియోగాన్ని కూడా తగ్గించుకుంటే మంచిదని, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు పర్ఫ్యూమ్‌లు వాడుకోవడం మేలని అంటున్నారు.

Admin

Recent Posts