Potatoes : మన వంటింట్లో తప్పకుండా ఉండే కూరగాయల్లో బంగాళాదుంపలు ఒకటి. బంగాళాదుంపలు మనం విరివిగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఫ్రై, పరోటా, చిప్స్, పకోడా, కూరలు ఇలా అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చాలా మంది ఈ బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇతర కూరగాయల వలె బంగాళాదుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ బంగాళాదుంప వంటకాలను తయారు చేసేటప్పుడు మనలో చాలా మంది ఎక్కువ నూనె వేసి తయారు చేస్తూ ఉంటారు. దీంతో ఆరోగ్యానికి మేలు చేసే బంగాళాదుంపలు అనారోగ్యానికి దారి తీస్తాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు, శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయని నిపుణులు చెప్పడంతో చాలా మంది వీటిని తీసుకోవడం తగ్గిస్తున్నారు.
అలాగే కొందరు వీటినే తినడమే మానేసారు. అయితే బంగాళాదుంపలను, వాటితో వండిన ఆహారపదార్థాలను ఒక నెలరోజుల పాటు తీసుకోకుండా ఉంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయని తెలసుకోవడానికి నిపుణులు కొన్ని పరిశోధనలు చేసారు. నెలరోజుల పాటు బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల మన శరీరంపై అనేక సానుకూల ప్రభావాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. బంగాళాదుంపలను నెలరోజుల పాటు తీసుకోకుండా ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాదుంపలను తీసుకోకపోవడం వల్ల మన శరీరానికి అదనంగా క్యాలరీలు అందకుండా ఉంటాయి. ఈ సమయంలో మనం తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరం చాలా సులభంగా బరువు తగ్గుతుంది. అలాగే బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నేరుగా రక్తంలో కలిపి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది బంగాళాదుంపలతో చేసిన ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. బంగాళాదుంపలతో చేసిన చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. వీటిలో నూనెతో పాటు ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇవి మన ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి. ఇలా ప్రాసెస్డ్ చేసిన ఫుడ్ ను తీసుకోకుండా ఉండడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ విధంగా నెలరోజుల పాటు బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేసారు. బంగాళాదుంపలను తీసుకున్నప్పటికి వాటిని వీలైనంత వరకు ఉడికించి, తక్కువ నూనెతో తయారు చేసుకుని తినాలని అప్పుడే వాటి వల్ల మన శరీరానికి హాని కలగకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.