నిద్రలో కొంద‌రు పళ్ళు కొరుకుతారు.. ఇలా ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి ? తెలుసా ?

నిద్ర‌పోయేట‌ప్పుడు స‌హ‌జంగానే కొంద‌రు ప‌ళ్ల‌ను కొరుకుతుంటారు. కొంద‌రు దంతాల‌ను కొరికితే పెద్ద‌గా తెలియ‌దు, కానీ కొంద‌రు కొరికితే బ‌య‌ట‌కు శ‌బ్దం వినిపిస్తుంది. అయితే ప‌ళ్ల‌ను కొరుకుతున్న‌ట్లు వారికే తెలియ‌దు. ఇక దీన్ని వైద్య ప‌రిభాష‌లో బ్ర‌క్సిజం (bruxism) అంటారు. బ్ర‌క్సిజం క‌చ్చితంగా ఎందుకు వ‌స్తుంద‌నే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కానీ నిపుణులు మాత్రం కొన్ని కార‌ణాల‌ను చెబుతున్నారు.

what is bruxism what are the causes for it

ఆందోళ‌న‌, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్త‌త ఎక్కువ‌గా వారు నిద్ర‌లో ప‌ళ్లు కొరుకుతార‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తార‌నే విష‌యంపై ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు. కానీ మానసిక స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్న‌వారే ఇలా చేస్తార‌ని నిపుణులు చెబుతున్నారు.

నిద్ర‌లో ప‌ళ్ల‌ను కొరికితే వారికి ఆ విష‌యం తెలియ‌దు. కానీ ప‌క్క‌న ఉండే వారికి ఇబ్బంది క‌లుగుతుంది. వారికి నిద్ర ప‌ట్టదు. అయితే పిల్ల‌ల్లో మాత్రం ప‌ళ్ల‌ను కొర‌క‌డం అనేది వేరే కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది.

చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నిషియం లోపాలు ఉన్నా.. వారు నిద్ర‌లో ప‌ళ్ల‌ను కొరుకుతారు. కాబ‌ట్టి చిన్నారుల‌కు పోష‌కాహారం ఇస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

పెద్ద‌లు ఈ స‌మ‌స్య త‌గ్గేందుకు ప్ర‌త్యేకంగా మందులు ఏమీ లేవు. కానీ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డం చేస్తే చాలా వ‌ర‌కు ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇక మెగ్నిషియం అధికంగా ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య తగ్గుతుంది. అలాగే రాత్రి పూట పాల‌లో ప‌సుపు క‌లుపుకున తాగినా లేదా హెర్బ‌ల్ టీల‌ను తాగుతున్నా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాటు రోజూ యోగా, ధ్యానం వంటివి చేసినా నిద్ర‌లో ప‌ళ్లు కొర‌క‌డం అనే స‌మ‌స్య త‌గ్గుతుంది.

Admin

Recent Posts