దేశంలోనే మొట్టమొదటిగా నీరా కేఫ్‌ను హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూ.20 కోట్లతో హుస్సేన్‌సాగర్ తీరంలో దీన్ని నిర్మించారు. హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న నీరా కేఫ్‌ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. అసలు నీరా అంటే ఏమిటి? దీనిలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ స్టోరీలో చూద్దాం. నీరా.. ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో సహజ చక్కెర ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, జింక్, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. దీనిలో ఆస్కార్బిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. నీరా మితంగా తీసుకుంటే.. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
నీరా గుండె, కార్డియోవెస్క్యులర్ సమస్యల ముప్పును తగ్గిస్తుంది. నీరాలోని పుష్కలంగా ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతంది. అయితే, ఇది ఎక్కువగా తాగితే లివర్ ఆరోగ్యానికి హాని జరుగుతుంది. నీరా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నీరాలో విటమిన్ సి మెండుగు ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనిలోని విటమిన్ B1 కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దృష్టి సమస్యలను దూరం చేస్తుంది. వైరల్ ఫీవర్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నీరా ఫ్లూ, సాధారణ జలుబు, జర్వం నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇది దగ్గు, తుమ్ములను ఆపివేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
నీరాలో విటమిన్ బి2 ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్‌పై విటమిన్ బి2 పోరాడుతుంది. క్యాన్సర్-నివారణ ఔషధంగా ఆసియా, ఆఫ్రికా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఘనాలో దీనిని ఉపయోగిస్తారు. నీరాలో ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. శరీర కణజాలలను సరి చేసి.. గాయాలను త్వరగా నయం చేయడానికి నీరా తోడ్పడుతుంది. కాంతివంతమైన చర్మం కావాలంటే.. అప్పుడప్పుడు నీరా తాగితే మంచిది.