మెదడుకు సడెన్ గా రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు స్పృహ తప్పడం అనేది జరుగుతుంది . ఉదాహరణకు…. అనుకోకుండా ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు , చాలా సేపు ఎటు కదలకుండా నిలబడి ఉన్నప్పుడు, తలకు ఏదైనా వస్తువు బలంగా తగిలినప్పుడు ఇలా జరుగుతుంది . స్పృహ తప్పిపోవడమనేది చాలా సార్లు తాత్కాలికం గానే జరుగుతుంది . కొద్ది నిముషాల్లోనే ఆ వ్యక్తీ తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాడు .కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోయే పరిస్థితులు కూడా ఉంటాయి.
స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి అతడి కాళ్ళ దింద 8 నుండి 12 అంగుళాల ఎత్తుగా దేనినైనా పెట్టాలి .( తలకు గాయం తగలనప్పుడు మాత్రమే ). స్పృహ తప్పిన వక్తి బిగుతైన దుస్తులు ధరించి ఉంటే ,వాటిని లూజ్ చేయాలి. ( బటన్స్, బెల్ట్ ). మెత్తటి తడి బట్టను నుదిటిపై వేయాలి .
సదరు వ్యక్తి 40 సంవత్సరాలు పైబడి….మాటిమాటికి స్పృహ కోల్పోతున్నట్టైతే… 4 లేదా 5 నిముషాల పాటు స్పృహలో లేకుండా ఉంటే…. కూర్చొని ఉండగా లేదా పడుకొని ఉండగా స్పృహను కోల్పోయినా , ఈ 3 సందర్భాల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి .