Wheat Grass Juice : కరోనా మహమ్మారి మానవాళి మనుగడకు పెద్ద సవాల్ విసురుతోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ సహజసిద్ధంగా పండిన ఆకుకూరలు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు ప్రస్తుతం గోధుమగడ్డి జ్యూస్ కూడా ఎక్కువగానే లభిస్తోంది. దీన్ని రోజుకు ఒక కప్పు చొప్పున పరగడుపునే తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమగడ్డిలో ఉండే ఔషధ గుణాలు ఆర్థరైటిస్, జలుబు సమస్యలను తగ్గించడంలో దోహదపడతాయి. ఇక ఈ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది. అలాగే అజీర్ణం, గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం పరగడుపునే గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఆకలి అదుపులో ఉండి శరీర బరువు తగ్గుతుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. మహిళలు నెలసరి సమయంలో దీన్ని తాగితే నొప్పులు తగ్గిపోతాయి. ఇలా గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగితే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.