ఏయే అనారోగ్య సమస్యలకు ఏయే పండ్లు, కూరగాయలు పనిచేస్తాయంటే..?

మనకు అందుబాటులో అనేక రకాల పండ్లు, కూరగాయలు తినేందుకు ఉన్నాయి. అయితే ఒక్కో రకం పండు, కూరగాయ వల్ల మనకు భిన్న రకాల లాభాలు కలుగుతాయి. కనుక ఏయే పండ్లను, కూరగాయలను తింటే ఏయే ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకోవాలి. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చిన వారు తమకు ఉన్న సమస్యకు అనుగుణంగా పండ్లను, కూరగాయలను తినేందుకు వీలుంటుంది. ఇక ఏయే సమస్యలు ఉన్నవారు ఏయే పండ్లు, కూరగాయలను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

Which fruits and vegetables work for which health problems

– జలుబు ఉన్నవారు క్యారెట్‌, పైనాపిల్‌ తినాలి. అల్లం, వెల్లుల్లిలను కూడా తీసుకోవాలి.

– తలనొప్పికి యాపిల్‌ పండు, కీరదోస, అల్లం, కొత్తిమీర పనిచేస్తాయి.

– అల్సర్లు ఉన్నవారు క్యాబేజీ, క్యారెట్‌, కొత్తిమీరలను తీసుకుంటే ఫలితం ఉంటుంది.

– హైబీపీ సమస్య ఉన్నవారు బీట్‌రూట్‌, యాపిల్‌, కొత్తిమీర, కీరదోస, అల్లం తీసుకోవాలి.

– క్యారెట్లు, పుచ్చకాయలు, కీరదోసలను తింటే కిడ్నీలు శుభ్రంగా మారుతాయి.

– కంటి సమస్యలకు, కంటి చూపుకు క్యారెట్‌, కొత్తిమీరలను తినాలి.

– మలబద్దకం ఉన్నవారు క్యారెట్లు, యాపిల్స్‌, క్యాబేజీ తినాలి.

– మద్యం సేవించడం వల్ల హ్యాంగోవర్‌ వచ్చిన వారు యాపిల్స్, క్యారెట్లు, బీట్‌రూట్‌, నిమ్మరసం తీసుకోవాలి.

– ఆందోళన, కంగారు వంటి సమస్యలు ఉంటే తరచూ క్యారెట్లు, కొత్తిమీర, దానిమ్మ పండ్లను తీసుకోవాలి.

– క్యారెట్లు, యాపిల్స్, పాలకూర, బీట్‌రూట్‌లను తీసుకోవడం వల్ల డిప్రెషన్‌ నుంచి బయట పడవచ్చు.

– క్యారెట్‌, పాలకూర, కొత్తిమీరలను తింటే డయాబెటిస్‌ ఉన్నవారికి మేలు జరుగుతుంది.

– ఆస్తమా సమస్యకు క్యారెట్లు, పాలకూర, యాపిల్‌, వెల్లుల్లి, నిమ్మరసం పనిచేస్తాయి.

– ఆర్థరైటిస్‌కు క్యారెట్లు, కొత్తిమీర, పైనాపిల్‌, నిమ్మరసం పనిచేస్తాయి.

– కిడ్నీ స్టోన్స్‌ ఉంటే నారింజ, యాపిల్‌, పుచ్చకాయ, నిమ్మరసం తీసుకోవాలి.

– ఒత్తిడి ఉన్నవారు అరటి పండ్లు, స్ట్రాబెర్రీలు, పియర్‌ పండ్లను తినాలి.

– అలసట ఉంటే క్యారెట్లు, బీట్‌రూట్‌, గ్రీన్‌ యాపిల్‌, నిమ్మరసం, పాలకూర తీసుకోవాలి.

– జ్ఞాపకశక్తి పెరిగేందుకు దానిమ్మ పండ్లు, బీట్‌రూట్, ద్రాక్షలు పనిచేస్తాయి.

– అజీర్ణ సమస్యకు పైనాపిల్‌, క్యారెట్‌, నిమ్మరసం, పుదీనా ఆకులు పనిచేస్తాయి.

Share
Admin

Recent Posts