హెల్త్ టిప్స్

పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లయిన కొత్తలో దంపతులు హ్యాపీగా ఉంటారు&period; జీవితంలో మార్పులు కూడా వస్తాయి&period; అయితే ఈ సమయంలో బరువు కూడా పెరుగుతుంటారు&period; చాలామంది ఇదే విషయం చెబుతారు&period; పెళ్లయితే బరువు పెరుగుతారని అంటుంటారు&period; అయితే వివాహం అయిన తర్వాత జంటలు బరువు ఎందుకు పెరుగుతారు&quest; దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట&period; పెళ్లికి ముందు అబ్బాయిలు&comma; అమ్మాయిలు తమ ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి డైట్ పై పూర్తిగా దృష్టిపెడతారు&period; కఠిన వ్యాయామాలు చేస్తారు&period; నడవడం&comma; యోగా వంటివి చేస్తుంటారు&period; తద్వారా పెళ్లి రోజున మంచి రూపంలో ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; వివాహ ఆచారాలు ప్రారంభమైన వెంటనే&period;&period; అమ్మాయి&comma; అబ్బాయిలకు సమయం ఉండదు&period; ఈ పరిస్థితి వివాహం తర్వాత దాదాపు ఒక నెలపాటు ఉంటుంది&period; దీని కారణంగా కూడా కొత్త జంట బరువు పెరుగుతారని టాక్&period; వివాహానికి సంబంధించి హిందూ సంప్రదాయంలో అనేక ఆచారాలు ఉన్నాయి&period; ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక స్పెషల్ చేస్తుంటారు&period; ఇక వంటకాలు కూడా అంతే&period; నెయ్యి&comma; నూనె&comma; పంచదారతో వంటకాలు బోలెడు చేస్తారు&period; చేసిన వంటకాలను వధూవరులకు టేస్ట్ చేయించాల్సిందే&period; ఆ కారణంగా కూడా వారు బరువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91972 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;marriage-2&period;jpg" alt&equals;"why bride and groom gain weight after marriage " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వివాహం తర్వాత కుటుంబ సభ్యులు&comma; బంధువులు&comma; సన్నిహితులు కొత్త జంటను తమ తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు&period; ఈ సమయంలో రకాల ఆహారాలు తింటారు&period; అది శరీరంలో కొవ్వు పెరుగుదలకు కారణం అవుతుంది&period; ఇంకా ఎక్కువ సేపు కూర్చోవడం&comma; కనీసం నడవలేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు&period; పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి సన్నాహల దాకా&comma; పెళ్లి పనుల్లో కొత్తజంటలు బాగా అలసిపోతుంటారు&period; సంగీత్ వేడుకలు&comma; మెహందీ&comma; హల్దీ వేడుకల కారణంగా అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటారు&period; దాంతో నిద్రలేమి సమస్యతో బాధపడతారు&period; ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts