Pakoda : వర్షం వచ్చిందంటే చాలు.. చల్లని వాతావరణంలో చాలా మంది వేడిగా, కారంగా ఏవైనా తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా చాలా మంది వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా పకోడీలను తినేందుకు ఇష్టపడతారు. అయితే పకోడీలకు, వర్షానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా సరే పకోడీలు అందుబాటులో ఉంటే వెంటనే వాటిని లాగించేస్తారు. అయితే వర్షం పడుతున్నప్పుడు చాలా మంది పకోడీలను ఎందుకు తింటారు ? ఆ సమయంలోనే వాటిని తినాలని ఎందుకు అనిపిస్తుంది ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షం పడుతున్నప్పుడు లేదా ఆకాశం మేఘావృతమైన ఉన్నప్పుడు, చల్లని వాతావరణంలో సహజంగానే ఎవరికైనా సరే వేడి వేడిగా కార కారంగా ఏవైనా తినాలని అనిపిస్తుంది. ఎందుకంటే విటమిన్ డి ఎక్కువగా లభించదు. అలాంటి సమయంలో శరీరం కార్బొహైడ్రేట్లను తినాలని కోరుకుంటుంది. దాంతో సెరటోనిన్‌ను శరీరం విడుదల చేస్తుంది. ఫలితంగా మన మూడ్ మారుతుంది. చల్లని వాతావరణంలో శరీరం వేడి కోరుకుంటుంది కనుక మనం సహజంగానే వేడిని పెంచే ఆహారాలను తింటాం. అయితే మనకు సులభంగా అందుబాటులో ఉండేవి పకోడీలే, మిక్చర్ అయితే చేసేందుకు సమయం పడుతుంది. పకోడీలు అలా కాదు. 5 నిమిషాల్లో చేయవచ్చు. అందుకనే చాలా మంది పకోడీలను తింటారు.
ఇక బాగా వేడి వాతావరణం ఉన్నప్పుడు మన శరీరం మెలటోనిన్‌ను రిలీజ్ చేస్తుంది. దీని వల్ల చల్లని ఆహారాలను తినాలని అనిపిస్తుంది. ఫలితంగా మన మూడ్ మారి మనం చల్లని ఫుడ్స్ వైపు చూస్తాం. ఇవన్నీ వాతావరణాన్ని బట్టి మన శరీరంలో రిలీజ్ అయ్యే హార్మోన్లపై ఆధార పడి ఉంటాయి. అందువల్ల ఎప్పుడైనా చల్లని వాతావరణం ఉన్నప్పుడు పకోడీలను తినాలని అనిపిస్తే తినేయండి. కానీ ఏ ఆహారాన్ని కూడా అతిగా తినకూడదు, అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.