హెల్త్ టిప్స్

Onion For Weight Loss : ఉల్లిపాయ‌తో పొట్ట దగ్గ‌రి కొవ్వు మొత్తం మాయం.. ఎలా తీసుకోవాలంటే..?

Onion For Weight Loss : మనం ఇంచుమించుగా అన్ని వంటల్లో కూడా ఉల్లిపాయల‌ని వాడుతూ ఉంటాము. ఉల్లిపాయ వలన ఆరోగ్యానికి, ఎంతో మేలు కలుగుతుంది. చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. సాంబార్, కూరలు మొదలు సూప్ ఇలా చాలా వాటిలో మనం ఉల్లిపాయల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయల వలన అనేక లాభాలని మనం పొందవచ్చు. ఉల్లిపాయలను తీసుకోవడం వలన చాలా సమస్యలకి చెక్ పెట్టొచ్చు.

ఖాళీ కడుపుతో ఉల్లిపాయల్ని తీసుకోవడం వలన మలబద్ధకం నుండి ఉపశమనం పొందొచ్చు. కొలెస్ట్రాల్, మధుమేహం కూడా ఉల్లిపాయతో దూరమవుతుంది. ఉల్లిపాయలు తీసుకోవడం వలన చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. గుండె సమస్యల్ని, బీపీని కూడా పోగొడుతుంది ఉల్లి. అందానికి కూడా ఉల్లి బాగా ఉపయోగపడుతుంది.

with onions you can reduce belly fat know how

శిరోజాల సంరక్షణకు కూడా ఉల్లిపాయలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కూడా ఉల్లి తొలగిస్తుంది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దానిని ఎలా తొలగించాలని అనుకుంటూ ఉంటారు. ఉల్లితో ఈ సమస్యకి చెక్ పెట్టేయచ్చు. సింపుల్ గా ఇలా ఉల్లి రసం తయారు చేసుకుని, తీసుకోవడం వలన బరువు తగ్గొచ్చు. అలానే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా దూరం అవుతుంది.

ఉల్లిపాయల్ని తొక్క తీసి ముక్కలుగా క‌ట్ చేయాలి. దీనిలో ఒక కప్పు నీళ్లు పోసుకుని మరిగించాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రసంలో ఇంకొంచెం నీళ్లు పోసుకుని దీన్ని తాగేయండి. ఇలా, మీరు ఉల్లి రసం తయారు చేసుకుని, తీసుకుంటే కొవ్వు బాగా కరుగుతుంది. ఉల్లితో సూప్ లాంటివి కూడా చేసుకోవచ్చు.

Share
Admin

Recent Posts