మహిళలు వారానికి రెండు పెద్ద డార్క్ చాక్లెట్లు తింటే బ్రెయిన్ స్ట్రోక్ 20 శాతం తక్కువ వచ్చే అవకాశాలున్నాయని స్వీడిష్ సైంటిస్టులు చెపుతున్నారు. మహిళలకు సాధారణంగా వచ్చే బ్రెయిన్ హెమరేజ్ స్ట్రోకులు చాక్లెట్లు తినడంతో అరికట్టవచ్చని, కొద్దిపాటి చాక్లెట్ తిన్నప్పటికి దాని ప్రభావం స్ట్రోక్ రిస్క్ పై అధికంగా వుంటుందని పరిశోధకులు సుసన్నా లార్సన్ తెలిపారు.
అయితే, మహిళలు పొందే ప్రయోజనాలు వారు తినే ఆహారంలోని చాక్లెట్లపై నేరుగా ప్రభావిస్తోందని వారానికి సుమారు 66.5 గ్రాములు చాక్లెట్ తీసుకోవాలని తెలిపారు.అసలు ఎపుడూ చాక్లెట్ తీసుకోని మహిళలను చాక్లెట్ విరివిగా రోజుకు మూడు సార్లుగా తినే మహిళలతో పోల్చి చూశారు. తీసుకోనివారికి అతి త్వరగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు కనుగొన్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే స్వీడిష్ మిల్క్ చాక్లెట్ ప్రతివారం తిన్నవారికి ఏ చాక్లెట్ తినని వారికంటే రిస్కు చాలా తక్కువని సూచించారు. అమెరికన్ చాక్లెట్ లకంటే స్వీడన్ చాక్లెట్లలో 30 శాతం అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయట. ఈ స్టడీ అమెరికన్ కాలేజ్ ఆప్ కార్డియాలజీ జర్నల్ లో ప్రచురించారు.