హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు ఈ హెర్బ‌ల్ టీని సేవిస్తే పీరియ‌డ్స్ టైముకు వ‌స్తాయి..!

చాలామంది మహిళలని వేధిస్తున్న సమస్య.. పీరియడ్స్ సక్రమంగా జరగకపోవడం. నెలసరి ఫ్లో సరిగ్గా లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై డాక్టరును సంప్రదించి మందులు కూడా వాడుతుంటారు. ఐతే హెర్బల్ టీ ద్వారా నెలసరి క్రమాన్ని సరిచేయవచ్చు. మీ కిచెన్ లో ఉండే వస్తువుల ద్వారా తయారయ్యే ఈ టీ వల్ల మీ నెలసరి క్రమం తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. దాల్చిన చెక్కని నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. అలా బాగా మరిగిన తర్వాత వడపోసి రోజు తాగాలి. ఒక నెల రోజల పాటు సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క వల్ల రుతుక్రమం క్రమంగా అవుతుంది. అలాగే బరువు తగ్గే అవకాశం ఉంది. నెలరోజుల పాటు సేవిస్తే ఈ ఫలితాలు మెండుగా ఉంటాయి.

అల్లం, తులసి, కొంచెం అల్లం,3-4తులసి ఆకులు.. ఈ రెండు పదార్థాలని నీళ్ళలో మరిగించి వడపోసి పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా నెలరోజుల పాటు చేయండి. తులసి ఆకులు ఆంటి యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అల్లం వలన ఆడవాళ్ల హార్మోన్లు బ్యాలన్స్ అవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లేమేటరీ కారణంగా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.

women take these herbal teas for regular periods

అల్లం కారణంగా మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి సమస్యలు రావు. ఈ రెండు హెర్బల్ టీలని తాగడం వల్ల రుతుక్రమం క్రమంగా మారుతుంది. పీరియడ్ ఫ్లో సక్రమంగా తయారవడానికి ఇది సరైన మార్గం. ఐతే మీకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లయితే డాక్టరుని సంప్రదించడం ఉత్తమం.

Admin

Recent Posts