Blue Tea : చాలా మంది ప్రతి రోజూ టీ, కాఫీలని తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీలు ఆరోగ్యానికి మంచిది కాదు. టీ, కాఫీల వలన ఆరోగ్యం బాగా పాడవుతుంది. వాటికి బదులుగా మీరు బ్లూ టీ ని తీసుకుంటే మంచిది. బ్లూ టీ తో ఆరోగ్యం బాగుంటుంది. బ్లూ టీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. బ్లూ టీ మంచి హెర్బల్ టీ. ఇందులో కెఫీన్ అసలు ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. బ్లూ టీ ని మనం బటర్ ఫ్లై పీ అనే పూల నుంచి చేసుకోవచ్చు. అదేనండి శంఖు పూలు. ముదురు నీలం రంగులో ఉంటాయి ఇవి.
ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బ్లూ టీ ని రోజూ తీసుకుంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. రక్తపోటుని నివారిస్తుంది. బ్లూ టీ ని తీసుకుంటే స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది.
బ్లూ టీ ని తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా బ్లూ టీ ని తీసుకోవడం వలన క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చూసుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా ఈ టీ ని తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ బాగా తగ్గుతుంది. యాంటీ డయాబెటిక్ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలతోపాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఈ టీ లో ఎక్కువగా ఉంటాయి.
అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడే వాళ్ళు, స్థూలకాయం సమస్యతో బాధపడే వాళ్ళు ఈ బ్లూ టీని తీసుకోవడం వలన బరువు బాగా తగ్గొచ్చు. గ్రీన్ టీ ని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. గ్రీన్ టీ ని తీసుకోవడం వలన బరువు కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు ఉండవు. అయితే గ్రీన్ టీ కంటే బ్లూ టీ బాగా పనిచేస్తుంది. కనుక ఈసారి ఈ టీ ని కూడా తీసుకోండి.